రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీలో రెండ్రోజుల నుంచి దాదాపు 222 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. గురువారం రోజున మధ్యాహ్నం వరకు 47 మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
బండ్లగూడ పీహెచ్సీ పక్కనే ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రంలో ఇవాళ 84 మంది అనుమానితులు టెస్ట్ చేయించుకోగా.. నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారికి కిట్ అందజేసి వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి చుట్టు పక్కల సర్వే చేయిస్తున్నారు. వ్యాక్సినేషన్‌తో పాటు రోజువారి చికిత్స కోసం వెళ్తున్న రోగులను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వస్తున్న రోగులు కొవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- ఇదీ చదవండి- PPE Kit: వాడేసినవి మార్కెట్లో మళ్లీ విక్రయం!