గుంటూరులోని ఓ వస్త్ర దుకాణం నిర్వాహకులు ప్రత్యేకమైన రోబోని తీసుకువచ్చారు. కొవిడ్ సమయంలో షోరూంకి వచ్చే వినియోగదారుల రక్షణ కోసం ఈ రోబో పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు వస్త్రదుకాణం లోపలకు రాగానే వారి చేతుల్లో శానిటైజర్ వేస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కొలుస్తుంది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తియిన వెంటనే మా షాపింగ్ మాల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆహ్వానం పలుకుతుంది.
షోరూం లోపల కూడా ఎవరైనా వినియోగదారులు మాస్కులు ధరించకపోతే వారిని అప్రమత్తం చేస్తుంది. రెండోసారి వారి చేతులు శానిటైజ్ చేస్తుంది. ఇలా రక్షణ వ్యవస్థ కోసం ఈ రోబోని వినియోగిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో వినియోగదారుల రక్షణ కోసమే దీనిని ప్రత్యేకంగా చెన్నైలో రూ.5లక్షలతో రూపొందించి తీసుకువచ్చారు. షోరూం కి వచ్చే వినియోగదారులు రోబోని చూసి ఆశ్ఛర్యానికి లోనవుతున్నారు. దీని పేరు జెఫిరా..కొవిడ్ స్టేఫ్టీ రోబో
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...