ETV Bharat / city

కరోనా సెకండ్‌వేవ్‌లో 10శాతం వరకు చిన్నారులపై ప్రభావం

author img

By

Published : May 21, 2021, 7:20 AM IST

కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా పిల్లలు ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌(మెస్సీ)’ ప్రభావానికి గురయ్యే అవకాశముందని చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ సతీశ్​ గంట వెల్లడించారు. కొవిడ్‌ సోకిన 2-6 వారాల తర్వాత యాంటిబాడీస్‌ అసాధారణ స్థాయిలో పెరిగి శరీరంపైనే దాడి చేయడాన్ని వైద్య పరిభాషలో మెస్సీగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Telangana news
పిల్లలపై కొవిడ్​ పంజా

రాబోయే రోజుల్లో పిల్లల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో కిన్నెర మెమోరియల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రాజగోపాల్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ రామ్‌ప్రసాద్‌ గురువారం ఆన్‌లైన్‌లో ‘‘కొవిడ్‌ కన్సర్న్స్‌ అండ్‌ చిల్డ్రన్‌: వాట్‌ పేరెంట్స్‌ నీడ్‌ టు నో’’ పేరిట వెబినార్‌ నిర్వహించారు. సెకండ్‌వేవ్‌లో పిల్లల్లో కరోనా సోకే ఉదంతాలు వేగంగా పెరుగుతున్నాయని చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ సతీశ్​ గంట అన్నారు. జనవరిలో 1-2 శాతంగా ఉన్న ఈ ఉదంతాలు ఏప్రిల్‌లో 4-5 శాతానికి, ప్రస్తుతం దాదాపు 10 శాతానికి పెరిగాయన్నారు.

పిల్లల్లో చలిజ్వరం, నీరసం, ఒళ్లునొప్పులు, తినకపోవడం, నిద్రలేమి తదితర లక్షణాలుంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలన్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడుతున్న పిల్లల్లో మూడొంతుల మందిలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వెలుగుచూస్తున్నాయన్నారు. త్వరగా గుర్తించి వైద్యం చేయిస్తే 100 శాతం తగ్గిపోయే సాధారణ జబ్బుగా కొవిడ్‌ను గుర్తుంచుకోవాలన్నారు. చిన్నపిల్లలకు సీటీ స్కాన్‌ అవసరం దాదాపుగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: రైల్వే కోచ్​లు వినియోగంలోకి తీసుకురావాలంటూ హైకోర్టులో పిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.