ETV Bharat / city

పూలవ్యాపారంపై కరోనా ప్రభావం.. శుభకార్యాలు లేక తగ్గిన ఆర్డర్లు - పూల మార్కెట్​పై కరోనా ప్రభావం న్యూస్

కరోనా మహమ్మారి.. పూల రైతులు, వ్యాపారుల మోములో ఆనందాన్ని దూరం చేసింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్లకు తీసుకొస్తున్నా.. సరకు అమ్ముడుకాకపోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. శుభ కార్యాలు లేకపోవడం.. ఆలయాలకు భక్తుల సంఖ్య తగ్గిపోవడం.. వేడుకలకు బొకేలు తీసుకెళ్లే వారు కరవవ్వడం వంటి కారణాలతో పూల వ్యాపారం కళ తప్పింది.

covid-impact-on-flower-markets
పూలవ్యాపారంపై కరోనా ప్రభావం.. శుభకార్యాలు లేక తగ్గిన ఆర్డర్లు
author img

By

Published : May 31, 2021, 10:18 AM IST

ఏపీలోని విజయవాడలోని హోల్‌సేల్‌ పూల మార్కెట్‌కు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పూలు రవాణా అవుతాయి. రైతులు నేరుగా బెజవాడ మార్కెట్‌కు పంట ఉత్పత్తులను పంపిస్తుంటారు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండడం, కరోనా భయంతో కొనేందుకు వినియోగదారులు మొగ్గు చూపకపోవడంతో మార్కెట్‌ వెలవెలబోతోంది.

సాధారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా వివాహాలు అంతంత మాత్రంగానే జరిగాయి. ఈసారైనా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని భావించిన రైతులు, వ్యాపారులకు సీజన్‌ ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో శుభకార్యాలు దాదాపుగా నిలిచిపోయాయి. అష్టకష్టాలు పడి పూలను మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవారు లేక టన్నుల కొద్ది పూలను పారబోయాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్ఫ్యూ సమయంలో తమకు కొంత వెసులుబాటు కల్పించాలని పూల వ్యాపారులు కోరుతున్నారు. ప్రజలతో నేరుగా తమకు సంబంధం ఉంటున్నందున... ప్రభుత్వం పూల మార్కెట్లోనే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి టీకాలు వేయించేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు.

పూలవ్యాపారంపై కరోనా ప్రభావం.. శుభకార్యాలు లేక తగ్గిన ఆర్డర్లు

ఇదీ చదవండి: oxygen concentrators: 250 కాన్సన్​ట్రేటర్లు సీఎంకు అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.