ETV Bharat / city

40 ఏళ్లలోపు వారే లక్ష్యంగా కొవిడ్ కాటు - నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు

కరోనా వేగంగా విస్తరిస్తోంది....వృద్ధులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. ఇదంతా ఒకప్పుడు... ఇప్పుడు వైరస్‌ ముంచుకోస్తోంది... యువతా..! తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. యువకులం... మాకేం అవుతుందిలే...! అన్న అజాగ్రత్తే కొంప ముంచుతోంది. బలంగా ఉన్నాం... వైరస్‌ దారిదాపుల్లోకి రాదన్న నిర్లక్ష్యమే నిండా ముంచేస్తోంది. దీంతో... వారితోపాటు వారి కుటుంబ సభ్యుల్ని కరోనా కబళిస్తోంది. ఈ నేపథ్యంలో... మందుల కోసం గడప దాటినా... మాస్క్‌ పెట్టాల్సిందే. నిత్యావసరాలకు వెళ్లినా... నిబంధనలు పాటించాల్సిందే. ఏ పని మీద బయటికి వెళ్లినా... భౌతిక దూరం ఉండాల్సిందే. ఇన్ని చెబుతున్నా... మాకేం కాదంటారా..? అయితే...మీరే కావోచ్చు... కరోనాకు సూపర్ స్ప్రెడర్లు.

covid effect targeting youth, 40 years of age youth corona effect
40 ఏళ్లలోపు వారే లక్ష్యంగా కొవిడ్ కాటు
author img

By

Published : Apr 29, 2021, 11:44 AM IST

40 ఏళ్లలోపు వారే లక్ష్యంగా కొవిడ్ కాటు

కొండల్నిసైతం కరిగించే శక్తి యువత సొంతం. అందుకేనేమో... తొలి దశ కరోనా ప్రభావం వీరిపై అంతగా పడలేదు. కానీ, సెకండ్‌ వేవ్‌ అందుకు భిన్నం. వైరస్‌ నన్ను ఏం చేయదులే..! అనే ధోరణిలో ఉన్న యువతపైనే పంజా విసురుతోంది. ఫలితంగా వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రస్తుతం.. దాదాపు 60-70% వృద్ధులకు ఇంట్లోని యువత వల్లే కరోనా సోకుతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. లాక్‌డౌన్‌ సడలింపులు తరువాత యువత కొవిడ్‌ నిబంధనలు పెడచెవిన పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

యువత సంఖ్య క్రమంగా..

రెండో దశ ఉద్ధృతిలో వైరస్‌ బాధితుల్లో చిన్నారులు, యువత సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...ఏప్రిల్‌లో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 56.4 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇప్పటి వరకు 43.2 శాతం కేసులు 21-40 ఏళ్ల యువతలోనే నిర్ధరణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా బారినపడుతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలి దశలో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన యువత శాతం తక్కువగా ఉన్నప్పటికీ...ఇప్పుడు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం... వైరస్‌ మ్యుటేషన్లు చెందడం వల్ల... లక్షణాలు వెంటనే కనిపించట్లేదు. ఫలితంగా... వైరస్‌ సోకినప్పటికీ స్వల్ప లక్షణాలే ఉండటం వల్ల యువత ఆసుపత్రిలో చేరడానికి ఆసక్తి కనబర్చట్లేదు. తద్వారా... పరిస్థితి విషమించే వరకు తీవ్రత అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతో నేరుగా ఐసీయూలో చేరాల్సిన దుస్థితి నెలకొందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

యువత ఎక్కువ సంఖ్యలో

సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. జనవరి నుంచి మార్చి వరకు నమోదైన కేసుల్లో 48% మంది 40 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. కర్ణాటకలో మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నమోదైన కేసుల్లో 47% మంది 15 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. దిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 65% మంది 45 సంవత్సాల లోపు వారేనని స్వయంగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లోనూ యువత ఎక్కువ సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. అందులోనూ... డయాబెటిస్‌, ఊబకాయం, హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నవారే అధికం.

60% మంది

కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం... 2020 డిసెంబర్‌ వరకు నమోదైన కేసుల్లో... 60% మంది 45 సంవత్సరాల లోపు వారే. కానీ, ఎక్కువగా మరణాలు నమోదు కాలేదు. కరోనాతో మృతి చెందిన వారిలో... 55% మంది 60 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. అయితే, రెండో ఉద్ధృతితో ఎక్కువగా ఏ వయసుల వారు ప్రభావితం అవుతున్నారో అని అధికారికంగా వైద్యారోగ్యశాఖ ప్రకటించకపోయినప్పటికీ... గణాంకాలు మాత్రం యువతపైనే ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.

బయట తిరుగుతున్నారు

కరోనాపై ఎంతో కొంత అవగాహన ఉంది... యువతకే. మరీ, అలాంటిది వారే నిర్లక్ష్యంగా ఉండటమేంటి..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, విద్య, ఉపాధి వంటి అవసరాల కోసం యువత బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. అందులో భాగంగా...బస్సులు, మెట్రో, ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మరోవైపు... కొందరు మాత్రం మాకేం అవుతుందిలే అని... అజాగ్రత్తతో కొవిడ్‌ నిబంధనలని అసలు పట్టించుకోవట్లేదు. పనులేమి లేకపోయినప్పటికీ... విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. కారణాలు ఏమైనా కావోచ్చు కానీ, ఇంట్లో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా కుటుంబ సభ్యులకు వేగంగా విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే... తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారు 14 శాతం వరకు ఉంటారని అంచనా.

అందరికీ టీకా అందిస్తే

కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరించడానికి మరో ప్రధాన కారణం... మ్యుటేషన్లు. సాధారణంగా వైరస్‌ మ్యుటేషన్లు జరుగుతున్నప్పడు... వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం 45 ఏళ్లపైబడిన వారికే ఇస్తున్నారు. ఫలితంగా, వారిలో ఎంతో కొంత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో... టీకా తీసుకోని 45 ఏళ్లలోపు వారే వైరస్‌కు ఎక్కువ గురవుతున్నారు. ఈ నేపథ్యంలో... 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా అందిస్తే.. వైరస్‌ వ్యాప్తిని తొందరగా అడ్డుకోవచ్చని ఇదివరకే.. మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు కేంద్రానికి బహిరంగంగానే విజ్ఞప్తి చేశాయి. శాస్త్ర నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో... మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది.

టీకా తీసుకోవాలని సూచన

100 రోజులకు పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... అపోహలతో చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో... యువత ఇలాంటి అపోహలను పక్కనపెట్టి... ధైర్యంగా టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తార స్థాయికి చేరే ప్రమాదం ఉంది. అందుకే... కనీసం తొలి డోసు అయినా తీసుకుంటే మేలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్క భారత్‌లోనే కాదు... దాదాపుగా అన్ని దేశాల్లోనూ 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వైరస్‌ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గినా మళ్లీ బయట ఎక్కువగా తిరిగేది... యువతే. టీకా వేయించుకున్నా... యువతరం ఇంకొంత కాలం తప్పని సరిగా సామాజిక దూరంతోపాటు భౌతిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.