ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం.. - జీఎస్టీ వసూళ్లపై కరోనా పంజా

కోవిడ్​ ప్రభావంతో ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. జీఎస్టీ రాబడులను జాతీయ స్థాయిలో సగటున చూస్తే గతేడాది ఆగస్టు కంటే 8శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ మూడు శాతం, ఆంధ్రప్రదేశ్‌ ఆరు శాతం అదనంగా వసూళ్లు చేయగా ఈ ఆగస్టులో తెలంగాణా 9శాతం, ఆంధ్రప్రదేశ్‌ 8 శాతం లెక్కన వసూళ్లు పడిపోయాయి.

covid effect on telugu states gst collections
తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం..
author img

By

Published : Sep 3, 2020, 5:17 AM IST

కరోనా ప్రభావంతో భారత్‌ దేశంలో కుదేలైన వ్యాపార, వాణిజ్య కార్యకలపాలు ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నాయి. గడిచిన 5 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు అయిదు నెలల్లో వచ్చిన రాబడులను ఈ ఏడాది అదే సమయానికి వసూళ్లైన రాబడులతో పోలిస్తే కోవిడ్‌ ప్రభావం ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన గణంగాల ప్రకారం..

నెల 2019(రూ. కోట్లలో) 2020(రూ.కోట్లలో)
ఏప్రిల్ 1,13,86532,172
మే1,00,28962,151
జూన్99,93990,917
జులై1,02,08387,422

రాబడులపై కరోనా ప్రభావం..

జీఎస్టీ వసూళ్లు... ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2019 జూన్‌ రాబడులతో ఈ ఏడాది జూన్‌ జీఎస్టీ వసూళ్లను పోలిస్తే... జాతీయ స్థాయిలో కేవలం 3 శాతం తగ్గింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఏకంగా 160శాతం, సిక్కింలో 79శాతం, నాగాలాండ్‌లో 63శాతం, ఛత్తీస్​గఢ్​లో 22శాతం, మధ్యప్రదేశ్‌లో 22శాతం, బీహార్‌లో 16శాతం, అస్సాంలో 11శాతం లెక్కన అంతకు ముందు ఏడాది జూన్‌ నెలలో కంటే ఎక్కువ వసూళ్లు అయ్యాయి. తెలంగాణలో 2019 జూన్‌లో రూ.3166 కోట్లు రాబడి రాగా... ఈ ఏడాది జూన్​లో రూ.3276 కోట్లు వసూళ్లై మూడు శాతం అదనంగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్​లో గతేడాది జూన్‌ నెలలో రూ.2232 కోట్ల జీఎస్టీ వసూళ్లు కాగా... ఈ ఏడాది జూన్‌ నెలలో రూ.2367 కోట్ల రాబడులు వచ్చి 6 శాతం అదనంగా వసూళ్లు అయ్యినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రాల్లో...

ఈ ఏడాది ఆగస్టు జీఎస్టీ వసూళ్లను గతేడాది ఆగస్టుతో పోలిస్తే... జాతీయ స్థాయిలో సగటున 8శాతం రాబడులు పడిపోయాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, నాగాలాండ్‌, ఛత్తీస్​గఢ్​లో మాత్రం అంతకు ముందు ఏడాది కంటే కొంచం ఎక్కువ రాబడులు వచ్చాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి... దిల్లీ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, చంఢీఘర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌, మణిఫూర్‌, మిజోరం తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పది శాతానికిపైగా 72 శాతం వరకు రాబడులు పడిపోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో గత ఆగస్టులో రూ. 3059 కోట్లు వసూలు కాగా... ఈ ఆగస్టులో రూ.2,793 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో జాతీయ సగటు కంటే ఒక శాతం ఎక్కువ రాబడి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్​లో గత ఏడాది ఆగస్టులో రూ.2115 కోట్ల రాబడి రాగా... ఈసారి రూ.1,955 కోట్లు ఆదాయం రావడం వల్ల 8శాతం తగ్గింది.

పుంజుకోవడానికి..

దేశ వ్యాప్తంగా ఒకదాని తరువాత ఒకటి అన్ని సంస్థలు తెరచుకుంటున్నందున... క్రమంగా జీఎస్టీ రాబడులు పెరుగుతాయన్న భావన ప్రభుత్వాల్లో వ్యక్తమవుతోంది. కానీ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి పెరగడం ప్రజల్లో భయం అధికమవుతోంది. అవసరం ఉంటేనే బయటకు వస్తున్నారు. గతంలో మాదిరి అనవసరంగా షాపింగ్‌లకు వెళ్లడం, కొనుగోళ్లు చేయడం తగ్గించేశారు. దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కరోనా ప్రభావం కారణంగా జీఎస్టీ రాబడులు పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి మరింత సమయం పట్టొచ్చరని ఆర్థిక నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.