ETV Bharat / city

విదేశీ విద్యపై కరోనా ప్రభావం

author img

By

Published : Jun 19, 2021, 4:29 PM IST

డిగ్రీ పట్టా చేతికి వచ్చిందా..? ఇంకేం మాస్టర్స్‌ కోసం విదేశానికి ఎగిరిపోవాల్సిందే..? అదృష్టం ఉంటే అమెరికా, లేకపోతే కెనడా..! ఆస్ట్రేలియా అయినా పర్వాలేదు. వీసా కోసం ప్రయత్నం చేయటం విదేశీ గడ్డపై అడుగు పెట్టటం..! ప్రస్తుతం.. విద్యార్థులంతా ఇదే ట్రెండ్ అనుసరిస్తున్నారు. కానీ, ఏడాదిన్నర కాలంగా విదేశీ విద్యపై కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇది వరకులా విదేశాలకు వెళ్లడం సాధ్యమేనా..? మునుపటిలా పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయా..? అక్కడే స్థిరపడేందుకు పరిస్థితులు ఏ మేరకు సహకరిస్తాయి...? పూర్తి వివరాలపై ప్రత్యేక కథనం..!

covid effect on foreign education
విదేశీ విద్యపై కరోనా ప్రభావం

అప్పట్లో... విద్య, ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లారు. ఆ తరువాత... పట్టణాల నుంచి రాజధానులకు వచ్చారు. 21 శతాబ్దంలో ఈ ఒరవడి మారిపోయింది. ఉన్నత చదువులు... ఉద్యోగ అవకాశాల కోసం విమానం ఎక్కేస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా... ఇలా నచ్చిన దేశానికి వెళ్తున్నారు. అలా... దాదాపు వందకుపైగా దేశాల్లో భారతీయుల ఉనికి ప్రభావవంతంగా ఉంది. ఇందులో...తెలుగు వారి వాటా కూడా అధికమే. అయితే, కరోనా కారణంగా కథ అడ్డం తిరిగింది. విదేశీ విద్యపై కరోనా ప్రభావం పడింది. ఫలితంగా...విద్యార్థులు బయటి దేశాలకు వెళ్లలేక... తమ ఆశలు, ఆశయాలు చంపుకోలేక మధనపడుతున్నారు.

విదేశీ విద్యపై కరోనా ప్రభావం

ప్రతి చోటా భారతీయ విద్యార్థులు...

ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రఖ్యాత యూనివర్సిటీ గడప తొక్కినా... భారతీయ విద్యార్థులు కనిపిస్తారు. ఎక్కువగా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, వైద్య విద్య కోర్సులు అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తుంటారు. ఈ మధ్య కాలంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అంచనాల ప్రకారం...2016లో 3 లక్షల 71 వేల 506 మంది, 2017లో 4 లక్షల 56 వేల 823 మంది...2018లో 5 లక్షల 20 వేల 342 మంది.. 2019లో 5 లక్షల 88 వేల 931 మంది వివిధ దేశాలకు వెళ్లారు. కానీ, కరోనా కారణంగా...గతేడాది ఈ సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి గతేడాది దాదాపు 36వేల మంది విద్యార్థులు మాత్రమే వెళ్లినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కరోనా ప్రభావం..

గతేడాది...జనవరి, ఫిబ్రవరిలో ప్రవేశాల ప్రక్రియ ముగియగానే కొవిడ్ ప్రభావం పెరిగింది. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా...సెప్టెంబరులో జరగాల్సిన ప్రవేశాల ప్రక్రియ, వీసాలపై ప్రభావం పడింది. 2020 చివర్లో కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ...పలు దేశాలు విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగించాయి. చాలా మంది విద్యార్థులు భారత్‌ రావడానికి మెుగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలు, నౌకల ద్వారా వివిధ దేశాల నుంచి దాదాపు 51 లక్షల మంది వెనక్కి వచ్చేశారు. ఇందులో...దాదాపు మూడున్నర లక్షల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు అంచనా.

ఆన్ లైన్ బోధన

చాలా వరకు యూనివర్సిటీలు ప్రత్యక్ష బోధన నిలిపివేసి.. ఆన్ లైన్ బోధన చేపట్టాయి. ఆన్ లైన్ తరగతుల ద్వారా విదేశీ విద్యాలయాల్లో చేరేందుకు మన విద్యార్థులు ఆసక్తిని చూపట్లేదు. లక్షలు ఖర్చైనా పర్వాలేదు...ఎలాగోలా యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలి..! విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుంది. ఆ తరువాత.. అక్కడే చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేయాలని భావిస్తారు. మంచి వేతనాలు ఇచ్చే కంపెనీల్లో చేరాలని..కొన్నాళ్ల తరువాత...ఆ దేశ పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. ఎక్కువ శాతం మంది విద్యార్థుల ఆలోచన ఇదే. ఈ తరుణంలో...ఆన్‌లైన్‌లో తరగతులు వింటూ... విదేశీ యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్లతో ఏ మేరకు ప్రయోజనం ఉంటుదన్న సందేహాలు విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.

స్పందన అంతంతమాత్రమే..

తక్షణ కర్తవ్యంగా ఆన్‌లైన్‌ తరగతుల్లో చేరినప్పటికీ... ఎప్పుడు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తాయో యూనివర్సిటీలు స్పష్టతనివ్వడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యక్ష బోధనకు సిద్ధంగా ఉన్నప్పటికీ... కరోనా సంక్షోభంలో అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు దొరుకుతాయో లేదోనన్న అనుమానాలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఉపాధి లభించకపోతే...ఖర్చులు భరించగలమా..? అని మధ్యతరగతి కుటుంబాలు విదేశీ విద్యకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రవేశాలకు ద్వారాలు తెరిచినప్పటికీ.. స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది.

తొలి ప్రాధాన్యత అమెరికానే..

ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ...భారతీయ విద్యార్థుల తొలి ప్రాధాన్యత...అమెరికానే. ప్రతిభ ఉన్న విద్యార్థులు..అగ్రరాజ్యాన్నే తమ గమ్య స్థానంగా ఎంచుకుంటుంటారు. అయితే, ట్రంప్ హయాంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో...భారతీయుల చూపు బ్రిటన్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మళ్లీంది. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ వన్ బీ, గ్రీన్ కార్డుల మంజూరులో సడలింపులు భారతీయ విద్యార్థులకు కొంత ఊరటనిచ్చాయి. ఈ నెల 14 నుంచి అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు వీసాల మంజూరు కూడా ప్రారంభించాయి. ఇదే బాటలో... కెనడా, బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలు సైతం ఆంక్షలు సడలిస్తున్నాయి. దీంతో.... విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కొత్త ఊపిరి వచ్చినట్టైంది.

వ్యాక్సిన్‌ తీసుకోవడంపై విద్యార్థుల్లో గందరగోళం..

ఇది వరకు వీసాలు...మార్కుల ఆధారంగా, యూనివర్సిటీల్లో సీటు ఆధారంగా వచ్చేవి. కరోనా పుణ్యమా అని...ఇప్పుడు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కూడా ఆ జాబితాలోకి చేరింది. అందులోనూ.. కొన్ని దేశాలు ఫలానా వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతిస్తామని ప్రకటిస్తున్నాయి. ఫలితంగా...ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో రెండు టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో... విద్యార్థులు ఏ టీకా తీసుకోవాలి..? రెండో డోసు కొవిషీల్డ్‌ తీసుకోవచ్చా...? ఏ కంపెనీ టీకాలు తీసుకున్నప్పటికీ...అమెరికా వెళ్లిన తరువాత ఫైజర్‌ తీసుకోవాల్సిందేనా...? ఇలాంటి చిక్కు ప్రశ్నలెన్నో విద్యార్థులను చుట్టుముడుతున్నాయి.

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ఐపీఎంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు సైతం విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వ్యాక్సిన్‌ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని విమర్శలు రావటం వల్ల...చాలా దేశాలు వ్యాక్సినేషన్ పై యూనివర్సిటీలకే స్వేచ్ఛనిచ్చాయి. అందులో భాగంగా.. కొన్ని యూనివర్సిటీలు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెబుతుండగా.. మరికొన్ని విశ్వవిద్యాయాలు ఇక్కడికి వచ్చాక తామే వేస్తామని కూడా చెబుతున్నాయి. అయితే, వీసాల జారీ విషయంలో మాత్రం వారు సూచించిన వ్యాక్సిన్‌లు వేసుకున్న వారికే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సన్నద్ధమవ్వాలి..

చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది. దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో నేటికీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి కాలేదు. యూనివర్సిటీలు జులైలో పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. అంటే సెప్టెంబరు నాటికి పట్టాలు చేతికి వస్తాయి. అయినా, ఏం పర్వాలేదు. డిగ్రీ సర్టిఫికెట్లు అక్టోబర్‌లో సమర్పించినా సరిపోతుందని కొన్ని యూనివర్సిటీలు అవకాశమిస్తున్నాయి. ఒకవేళ ఉత్తీర్ణత సాధించకపోతే అడ్మిషన్ రద్దు చేస్తామన్న షరతుతో అనుమతినిస్తున్నాయి. అలాగే, కొన్ని దేశాలు జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలకు ఈ ఏడాది మినహాయింపునిచ్చాయి. ఈ నేపథ్యంలో.. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఏ నిశ్చింత లేకుండా సన్నద్ధమవ్వాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆంక్షల సడలింపు దిశగా దేశాలు కదులుతున్నాయి. టీకాల భరోసాతో.... ప్రత్యక్ష బోధనకు యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాయి. అనవసర భయాలకు పోకుండా... ఎప్పటిలాగే విద్యార్థులు సన్నద్ధమవ్వాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా ...? ఎత్తేస్తారా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.