ETV Bharat / city

ఎల్పీజీ నెట్‌వర్క్‌ సిబ్బందిపై కొవిడ్ పంజా..4 వేలకు పైగా బాధితులు

రాష్ట్రంలో వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా చైన్‌లోని వాళ్లందరినీ.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని రాష్ట్ర ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ డిమాండ్‌ చేస్తోంది. డెలివరీ బాయ్స్‌, సహాయక సిబ్బంది, డీలర్లు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పొతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈనెల 28లోపుప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. 29 నుంచి గ్యాస్‌ సిలిండర్ల డోర్‌డెలివరీ నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్‌ స్పష్టంచేసింది. సిలిండర్లను గోడౌన్‌ల దగ్గర మాత్రమే అందిస్తామని ప్రకటించింది.

ఎల్పీజీ నెట్‌వర్క్‌ సిబ్బందిపై కొవిడ్ పంజా
author img

By

Published : May 25, 2021, 5:18 AM IST

Updated : May 25, 2021, 5:59 AM IST

ఎల్పీజీ నెట్‌వర్క్‌ సిబ్బందిపై కొవిడ్ పంజా..4 వేలకు పైగా బాధితులు

రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసే.. డెలివరీ బాయ్స్‌, సహాయక సిబ్బంది, డీలర్లు కరోనా బారిన పడుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల వినియోగం పెరిగి.. సిలిండర్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు కోటిన్నర గ్యాస్‌ కలెక్షన్లు ఉండగా రోజూ రెండులక్షల సిలిండర్ల డెలివరీ జరుగుతోంది. 500 మంది ఎల్​పీజీ డీలర్లు, పదమూడున్నరవేల మంది సిబ్బంది.. మొత్తం 14వేల మంది భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే నాలుగు వేలకుపైగా సిబ్బంది, డెలివరీబాయ్స్, డీలర్లు కరోనా బారిన పడ్డారు. 9 మంది ఏల్​పీజీ అధీకృత డీలర్లు, 44 మంది డెలివరీ బాయ్స్‌ మృత్యువాతపడ్డారు. పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం నెట్‌వర్క్‌ను కలవరపెడుతోంది. తమను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలని లేదంటే సిలిండర్ల సరఫరా నిలుపుదల చేస్తామని ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే..
పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాలే కాకుండా.. పట్టణ, నగరాల్లోనూ గ్యాస్ సిలిండర్లును ఇంటింటికి సరఫరా చేయలేమని అసోసియేన్‌ స్పష్టంచేసింది. డెలివరీ బాయ్స్‌ నుంచి వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. ఇదే అంశంపై రెండు నెలలుగా పౌరసరఫరాల, ఆరోగ్యశాఖతో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం లేవని ఆవేదన వ్యక్తం చేసింది.. ఎల్​పీజీ పరిధిలోకి వచ్చే వాళ్లందరినీ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి... కరోనా టీకాలు వేయాలని ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, దిల్లీ, మహారాష్ట్ర, అసోం సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారని వివరించింది..

అధికారులదే బాధ్యత..

కరోనా ప్రభావం వల్ల పంపిణీదారులు, సిబ్బంది అందుబాటులో లేక ఎల్​పీజీరీఫిల్, హోం డెలివరీలో ఏదైనాప్రభావం చూపితే సంబంధిత అధికారులదే బాధ్యత అని రాష్ట్ర ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌ హెచ్చరించింది.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్​

Last Updated : May 25, 2021, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.