ETV Bharat / city

టీకాల ఉత్పత్తి సరే... మరి పంపిణీ ఎలా! - కొవిడ్​ వ్యాక్సిన్ పంపిణీ

యావత్‌ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశీయ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి అంతమే లక్ష్యంగా కేంద్రం అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో... వాక్సిన్‌ సమర్థత కంటే పంపిణీ పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సువిశాలమైన దేశంలో టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లేంటి..? తగిన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలేంటి..? కేంద్రం ఏయే రాష్ట్రాలకు ఏ టీకాలను పంపిణీ చేయనుంది...? ఇలాంటి ప్రశ్నలెన్నో ఆసక్తి రేపుతున్నాయి.

covid 19
covid 19
author img

By

Published : Jan 6, 2021, 12:41 PM IST

టీకాల ఉత్పత్తి సరే... మరి పంపిణీ ఎలా!

ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతుంటాయి. కొన్ని జబ్బులకైతే దశాబ్దాల తరబడి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఒక్క వ్యాక్సిన్‌ తయారు చేయటానికి ఐదేళ్లు పడుతుంది. కానీ, కరోనా మహమ్మారిని అంతం చేయాలనే లక్ష్యంతో.. ఏడాదిలోనే దేశీయ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అవి ప్రభావవంతంగా పని చేస్తాయా? కొత్త స్ట్రెయిన్‌లపై ఎలా ప్రభావం చూపిస్తాయి..? అనే సందేహాలు ఉన్నప్పటికీ... అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ ఉత్పత్తి... పంపిణీలో ఎదురయ్యే సవాళ్ల గురించే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొత్తం ప్రక్రియకు ఏడాది సమయం

టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చినప్పటికీ ఉత్పత్తి విషయంలో అసలు సవాళ్లు ఉంటాయి. ఔషధం గానీ, వ్యాక్సిన్‌ గానీ కనిపెట్టిన తర్వాత ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు పాటించాలి. ధర నిర్ణయించడంలో డ్రగ్స్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలు, నేషనల్‌ ఫార్మాస్యూటిక్‌ ప్రైసింగ్‌ అథారిటీ నిబంధనలు అనుసరించాలి. అప్పుడే ఔషధం మార్కెట్‌లోకి వస్తుంది. మెుదటి మూడు దశలు పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన తరువాత కూడా నాల్గో దశ ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మెుత్తం పూర్తయ్యి... దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ విరివిగా అందుబాటులోకి రావటానికి మరో ఏడాది సమయం పడుతుందంటున్నారు నిపుణులు.

సవాళ్లు ఉన్నాయి

సువిశాలమైన దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ అనేది సవాల్‌తో కూడుకున్నదే. అయితే మనకు ఇప్పటికే సార్వత్రిక టీకాలు అందజేస్తున్న అనుభవం ఉంది కాబట్టి... కొవిడ్‌ టీకా సరఫరాకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకూ రెండు టీకాలకు అనుమతి లభించింది. ఇందులో ఏ వ్యాక్సిన్‌ ఏ రాష్ట్రానికి వెళ్తుందో స్పష్టత లేదు. ఏ టీకా వచ్చినా రోడ్డు లేదా విమాన మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది. ఒకవేళ పుణె నుంచి వస్తే ఇన్సులేటెడ్‌ కార్గో విమానంలో తీసుకొస్తారు. విమానాశ్రయానికి వచ్చిన తర్వాత ప్రత్యేక అతి శీతలీకరణ కంటైనర్‌లో రాష్ట్రస్థాయి టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలించి.. ఆ తర్వాత ఆసుపత్రులకు చేరవేస్తారు. ఈ ప్రక్రియ అత్యంత కీలకం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటయ్యాయి. అవి టీకాల నిల్వకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేసేందుకు కృషి చేస్తాయి.

నిల్వ సామర్థ్యం ఉందా

పంపిణీలో మరో సవాల్‌... శీతల గిడ్డంగులు. దేశవ్యాప్తంగా 10వేలకు పైగా శీతల గిడ్డంగులు ఉన్నప్పటికీ... అందులో 0.5 శాతం మాత్రమే ఫార్మాకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి, అవసరమైన చోట్ల వ్యాక్సిన్‌ నిల్వకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలి. అంతేకాకుండా, వ్యాక్సిన్‌ నిల్వ చేసే శీతల గిడ్డంగులు ప్రత్యేకమైన లైసెన్సులు కలిగి ఉండాలి. అమెరికా, రష్యాలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌లు దాదాపు మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. కానీ, మన దేశంలో తయారైన వ్యాక్సిన్‌లు 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే, వ్యాక్సిన్‌లు ఇంతకాలం మాత్రమే శీతల గిడ్డంగుల్లో ఉంచాలని అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ.. కనీసం 6 నెలల పాటు నిల్వ చేసేందుకు నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అవి సహజం

అత్యవసరంగా అనుమతించిన వ్యాక్సిన్‌ల భద్రత విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని డీసీజీఐ వీజీ సోమని తెలిపారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితం అని ప్రకటించారు. కొద్ది పాటి జ్వరం, ఒళ్లునొప్పులు, అలర్జీ వంటి పలు ప్రతికూల ప్రభావాలు ఏ వ్యాక్సిన్‌కైనా సహజమేనన్నారు. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు రావడం గర్వంగా ఉందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. దేశ వైజ్ఞానిక రంగంలో ఇదో గొప్ప మైలురాయిగా అభిప్రాయపడ్డారు. 'మిగతా టీకాల కన్నా కొవాగ్జిన్‌ ప్రత్యేకమైనది. ఎందుకంటే... దీర్ఘకాలం పాటు వ్యాధి నిరోధకత ఇస్తుంది. వైరస్‌ను సమర్థంగా అడ్డుకోవడంతోపాటు ఉత్పరివర్తనాలు చెందకుండా నిలువరిస్తుంది. అత్యంత సురక్షితమైన, సమర్థమైన టీకాను అభివృద్ధి చేశామని, త్వరలో ప్రపంచానికి అందిస్తామని' భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు.

పంపిణీ కోసం చర్యలు

కేంద్రం నుంచి ఎప్పుడు సరఫరా మొదలైనా సరే... మొత్తంగా 3 కోట్ల డోసులను ఏకకాలంలో నిల్వ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంపిణీ కోసం ఇప్పుడున్న వాహనాలు కాకుండా అదనంగా మరో 19 ఇన్సులేటెడ్‌ వాహనాలను కొనుగోలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. అవసరమైన చోట... ఆర్టీసీ సేవలను సైతం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కనీసం 65 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెంది వైరస్‌ వ్యాప్తికి దాదాపు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో... టీకా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

ఇదీ చదవండి : 'దేశంలో త్వరలో రోజుకు 10లక్షల టీకాలు పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.