ETV Bharat / city

కేటీఆర్​కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో "కొవిడ్ -19 రిషేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్" అనే అంశంపై జరిగే వర్చువల్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం పంపారు.

covid-19
మంత్రి కేటీఆర్​కు అరుదైన గౌరవం
author img

By

Published : May 28, 2020, 7:48 PM IST

మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం అందింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు మరోసారి అలాంటి గౌరవం దక్కింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో "కొవిడ్ -19 రిషేప్ సౌత్ ఏషియా ఫ్యూచర్" అనే అంశంపై జరిగే వర్చువల్ సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు మంత్రి కేటీఆర్​ను కోరారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రీ బాడీ అయిన ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక విభాగం ఆధ్వర్యంలో మే 30 సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు వంద దేశాల్లో 45 మిలియన్ల సభ్యులున్న ఈ సంస్థ.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, అనేక ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతుంది.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.