ETV Bharat / city

జీహెచ్​ఎంసీలో నేటి నుంచి మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు - జీహెచ్​ఎంసీలోమొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు

కరోనా నిర్ధరణ పరీక్షలను రాష్ట్రప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రస్తుతం టెస్టుల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉండగా. ఇక నుంచి ప్రజల చెంతకే కొవిడ్ నిర్ధరణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నగ్రేటర్​ పరిధిలో కంటెయిన్‌మెంట్‌ ‌ ప్రాంతాల్లో తొలుత వీటిని వినియోగిస్తారు. ఇందుకోసం 20 సంచార వాహనాలు సిద్ధం చేశారు. ఇవి నేటి నుంచి సేవలందించనున్నాయి

జీహెచ్​ఎంసీలో నేటి నుంచి మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు

author img

By

Published : Jul 30, 2020, 5:20 AM IST

Updated : Jul 30, 2020, 6:10 AM IST

ప్రస్తుతం బస్తీదవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులన్నింటిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రస్తుత విధానంలో పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉండగా.. ఇక నుంచి ప్రజల చెంతకే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో తొలుత వీటిని వినియోగిస్తారు. నేటి నుంచే సేవలు ప్రారంభమవుతాయి. 20 సంచార వాహనాలను ఇందుకోసం సిద్ధం చేశారు.

ఒకేసారి 10 మందికి నమూనాలు

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సుల్లో ఒకేసారి 10 మందికి నమూనాలను సేకరించేందుకు వీలుగా.. ఒక్కో బస్సులో 10 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా యాంటీజెన్‌ పరీక్షలతో అక్కడికక్కడే ఫలితాలు వెల్లడవుతాయి. లక్షణాలుండి యాంటీజెన్‌ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినవారిలో.. అవసరాలకు అనుగుణంగా ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో పరీక్షించేందుకు వీలుగా కూడా నమూనాలు సేకరిస్తారు. ఆ నమూనాలను ప్రభుత్వ నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు పంపిస్తారు. ‘వెర స్మార్ట్‌ హెల్త్‌’ సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు.

మూడు రకాల సేవలు

  • ‘ఇంటెలిజెన్స్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌(ఐమాస్క్యు)’ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులను రూపొందించారు. ఇందులో మూడు రకాల సంచార వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో నిర్వహించే పరీక్షల సమాచారాన్ని ఎప్పకటిప్పుడూ ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు.
  • మొదటి తరహా బస్సులో పూర్తిగా అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంటుంది. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌తోకూడిన ఐసీయూలో 4 పడకల సదుపాయం ఉంటుంది. అవసరమైన మందులుంటాయి. అవసరమైతే ఐసొలేషన్‌లో ఉండేందుకు చిన్నగది కూడా ఉంటుంది. యాంటీజెన్‌ నిర్ధారణ పరీక్షలుకూడా చేస్తారు. ప్రస్తుతం ఈ తరహాలో ఒక్క బస్సు అందుబాటులో ఉంది.
  • రెండో తరహా బస్సులో ఏకకాలంలో 10 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఇందులోనే ఒకపక్క యాంటీజెన్‌ నమూనాలను పరీక్షిస్తారు. 20 వాహనాలను గురువారం నుంచే రంగంలోకి దించుతున్నారు. మరో 30 వాహనాలను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
  • మూడోరకం ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యమున్న అంబులెన్సులు. వీటి ద్వారా అత్యవసరంగా ఆసుపత్రి సేవలు అవసరమయ్యేవారికి త్వరితగతిన చికిత్స లభించేందుకు ఈ వాహనాలు దోహదపడుతాయి. ప్రస్తుతం ఈ తరహాలో 20 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.
  • వీటిల్లో పనిచేసే డ్రైవర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర సాంకేతిక నిపుణులను ‘వెర’ సంస్థే నియమించుకుంటుంది.
  • పరీక్షలకు వినియోగించే పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు, గ్లౌజులు, ఇతర వస్తువులను ప్రభుత్వం సమకూర్చుతుంది. 20 బస్సులద్వారా రోజూ 60వేల నమూనాలు
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏయే కంటెయిన్‌మెంటు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించాలనేది ముందే ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఆ ప్రకారమే ఈ వాహనాలు ఆయా ప్రాంతాల్లో సేవలందిస్తాయి.
  • ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం ఉండడం వల్ల సుదూర ప్రాంతాల్లోని బాధితులకు కూడా ప్రాణవాయువు, ఔషధాలను అందిస్తూ త్వరితగతిన ఆసుపత్రికి చేర్చడానికి అవకాశాలుంటాయి.
  • ఒక్కో బస్సులో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలనుసేకరించేందుకు వీలుండడంతో..గంటకు సుమారు 500 మందిలో నమూనాలు తీసుకోవచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రోజుకు ఒక బస్సు ఆరు గంటలు సేవలందిస్తే.. సుమారు 3వేల నమూనాలను ఒక్క బస్సు ద్వారానే సేకరించడానికి అవకాశాలుంటాయి.
  • ఈ లెక్కన మొత్తం 20బస్సుల్లో కలుపుకొని ఒక రోజులోనే దాదాపు 60వేల నమూనాలను పరీక్షించవచ్చు. ఒకవేళ వచ్చేవారంలో 50బస్సులు గనుక అందుబాటులోకి వస్తే.. ఒక్కరోజులోనే వీటి ద్వారా దాదాపు 1.50 లక్షల నమూనాలను పరీక్షించడానికి వీలుంటుంది.
  • బస్తీల్లోకే బస్సులొస్తాయి కాబట్టి.. ప్రజలు దవాఖానాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితాలు కూడా యాంటీజెన్‌లో వెంటనే వస్తాయి కాబట్టి.. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని వెంటనే అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు.
  • ఏయే ఆసుపత్రుల్లో పడకలెన్ని ఖాళీగా ఉన్నాయనే సమాచారం వీరి వద్ద ఉంటుంది.
  • పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా బాధితులను త్వరగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకున్నట్లవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
  • మున్ముందు రాష్ట్రంలోని ఇతర కంటెయిన్‌మెంటు ప్రాంతాల్లోనూ ఈ సంచార నిర్ధారణ పరీక్షల వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

81 శాతం మందిలో...

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ బస్సులను బుధవారం ప్రారంభించారు. ‘‘రోజుకు 16-17వేల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చినవారిలో 81 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు ఉండడం లేదు. ఐసొలేషన్‌ సౌకర్యమున్నవారిని ఇళ్లలోనే ఉంచుతున్నాం. లేనివారిని ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నాం. ఇళ్లలో చికిత్స పొందుతున్నవారిని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలనే లక్ష్యంతో ‘హితం’ యాప్‌ను త్వరలో ప్రవేశపెడుతున్నాం. లక్షణాలున్నవారిని, ముప్పు పొంచి ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకొని అధునాతన చికిత్స అందిస్తున్నాం. ఖరీదైన ఔషధాలను కూడా సమకూర్చాం. వైద్యసిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు’’ అని ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు, వెర సీఈఓ ధర్మతేజ, సీఓఓ విజయ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

Last Updated : Jul 30, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.