మేడ్చల్ జిల్లాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కుత్బూల్లాపూర్ నియోజకవర్గంలో ఇవాళ కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణయ్యాయి. వాటిల్లో రెండు గాజులరామరం, రెండు నిజాంపేట్ పరిధిలో, ఒకటి జగద్గిరిగుట్టలో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. అందులో 32 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం 44 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?