ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో, సుఖసంతోషాలతో జీవించాలంటే... మహాత్మాగాంధీ ఆలోచనలు, ఆయన స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని మహాత్మాగాంధీ ట్రస్ట్ అధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ మార్గంలోనే నడుస్తోందని... అందులో భాగంగానే పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. శ్రీరాముడిని దేవుడిగా కొలిచినట్టే... గాంధీజీ కూడా దేవుడిగా పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గుస్సాడి కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కంపెనీ డైరెక్టర్ ఏవీఎన్ రాజు, ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్