ఏపీలో గడిచిన 24 గంటల్లో 88,149 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 24 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,201మంది బాధితులు కోలుకున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో... చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూరంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, కర్నూల్లో ఒక్క రు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు.