ETV Bharat / city

రాష్ట్రంలో 487కు చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 487కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 45 మంది డిశ్చార్జ్ కాగా.. 12 మంది మృతి చెందారని పేర్కొంది. లాక్‌డౌన్‌ వల్ల కేసుల సంఖ్య తగ్గిందన్న సీఎం కేసీఆర్‌... మరికొన్ని రోజులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్ని కోరారు. వైరస్‌ సోకిన వ్యక్తులతో సాన్నిహిత్యంగా తిరిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

corona toll reaches 487 in telangana state
రాష్ట్రంలో 487కు చేరిన కరోనా కేసులు
author img

By

Published : Apr 11, 2020, 5:52 AM IST

Updated : Apr 11, 2020, 7:04 AM IST

రాష్ట్రంలో మరో 16 మందికి కొవిడ్‌-19 సోకినట్లు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 487కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందగా 45 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 430 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో 10 మంది బాధితులున్నట్లు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేసులకు గాను ఇద్దరు కోలుకున్నారని.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌ జిల్లాలో 200 మందికి వైరస్‌ సోకగా వారిలో 21 మందికి నయమైందని తెలిపింది. మరో 179 మందికి చికిత్స జరుగుతోందని పేర్కొంది. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 19 మంది, కామారెడ్డి జిల్లాలో 10 మంది బాధితులున్నట్లు తెలిపారు.

కరీంనగర్‌లో 18 కేసులకు గాను 11 మంది కోలుకోగా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్‌లో ఒక కేసు నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 11 కేసులకు గాను ఒకరు కోలుకున్నారుు. మెదక్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 23 మంది బాధితులకు గాను ఇద్దరికి నయమైందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ములుగు, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో రెండేసి.. నల్గొండలో 12, నిర్మల్‌ 15, నిజామాబాద్‌లో 49, పెద్దపల్లిలో రెండు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 34 కేసులు నమోదుకాగా ఏడుగురు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో ఏడు, సిద్దిపేటలో ఒకటి, సూర్యాపేటలో తొమ్మిది, వికారాబాద్‌ జిల్లాలో ఎనిమిది కేసులున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 24 కేసులు నమోదు కాగా ఒకరు కోలుకున్నారు. ఖమ్మంలో రెండు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు నమోదైంది.

కేసుల సంఖ్య తగ్గే అవకాశం

మర్కజ్ నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు పూర్తైనందున ఇకపై కేసులు తగ్గుముఖం పడతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. గతంలో కేవలం ఫ్లూ లక్షణాలు ఉన్నవారే మాస్కులు వేసుకోవాలని సూచించిన అధికారులు.. ఇప్పటి నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ సోకిన కొందరిలో ఏ లక్షణాలు కనిపించకపోవడం.. మరికొందరిలో 14 రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతుండడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

Last Updated : Apr 11, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.