ETV Bharat / city

Covid Third Wave:కొవిడ్ మూడోదశ ముప్పు.. ఈ ఏడాదైనా పాఠశాలలు కొనసాగేనా..? - కొవిడ్ మూడోదశ

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి, ప్రత్యక్ష బోధనను మొదలుపెడుతున్నాయి. అయితే.. అక్టోబరు నాటికి కరోనా థర్డ్​ వేవ్ తారస్థాయికి చేరుకునే​ ప్రమాదం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్న వేళ.. పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలను పునఃప్రారంభించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

corona third wave in october
కొవిడ్ మూడోదశ ముప్పుతో పాఠశాలలపై మళ్లీ ప్రభావం
author img

By

Published : Aug 23, 2021, 10:43 PM IST

ఏడాదిన్నర కాలంగా కరోనా ప్రభావంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాఠశాలలు మూతపడగా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్​లైన్​ క్లాసులు వంటివి జరుగుతున్నప్పటికీ.. ప్రత్యక్ష బోధన ద్వారా సాధించే ఫలితాలు ఆన్​లైన్​ క్లాసుల ద్వారా రావట్లేదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​ వంటి​ రాష్ట్రాలు.. పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నాయి. ఇవేగాకుండా ఉత్తర్​ప్రదేశ్​ వంటి మరికొన్ని రాష్ట్రాలు కూడా పాఠశాలలను తెరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే.. కరోనా మూడో దశ మప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. పాఠశాలలు పునఃప్రారంభించడంలో ఎదురయ్యే ఇబ్బందులేమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి?

పెంచాల్సిన అవసరం ఉంది..

దేశంలో కరోనా మూడోదశ(థర్డ్​ వేవ్​) ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. కరోనా మూడోదశ అక్టోబర్‌లో తారస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు నిపుణుల కమిటీ నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది ఎన్​ఐడీఎం.

చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడితే.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని ఎన్ఐడీఎం కమిటీ పేర్కొంది. చిన్న పిల్లలకు వైద్య కోసం డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇతర వ్యాధులు, వైకల్యం గల పిల్లలకు కరోనా టీకా వేయాలని సూచించింది. పిల్లలతో పాటు వారి సంరక్షకులు కూడా ఉండేలా కొవిడ్‌ వార్డుల్లో మార్పులు చేయాలని తెలిపింది. 'మూడో దశ సన్నద్ధత: చిన్నారులపై వైరస్ ప్రభావం, కోలుకోవడం' పేరుతో ఎన్​ఐడీఎం ఈ నివేదికను రూపొందించింది.

పిల్లలకు వ్యాక్సినేషన్​..

వైరస్​ బారి నుంచి పిల్లలను తప్పించాలంటే వారికి టీకాలు వేయడమే అత్యుత్తమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దేశంలో పిల్లల కోసం కరోనా టీకాలు అందుబాటులోకి రానేలేదు. జులై లేదా ఆగస్టులో పిల్లలకు కరోనా టీకా వేయడం ప్రారంభిస్తామని జూన్​ 27న కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ, ఇంతవరకు టీకా పంపిణీ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. మరోవైపు.. కరోనా థర్డ్​ వేవ్​లో వైరస్​ ఉత్పరివర్తనాలు.. ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఎదుర్కోలేవు అని కూడా కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీకాలు ఉన్నాయా?

పిల్లలకు సంబంధించి జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన టీకా.. క్లినికల్​ ట్రయల్స్​ పూర్తయ్యాయని నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్ ఆన్​ ఇమ్యూనైజేషన్(ఎన్​టీఏజీఓ) ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​.కె.అరోడా తెలిపారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించిన వెంటనే 12 నుంచి 18 ఏళ్ల వారికి టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. అంతకుముందు, పిల్లలకు సంబంధించి భారత్​ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా.. త్వరలోనే దేశంలో అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ టీకా రెండు, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ ఫలితాలు సెప్టెంబర్​ నాటికి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు పైజర్ టీకాను పంపిణీ చేస్తున్నారు. ఈ టీకా వినియోగానికి అనుమతి లభిస్తే చిన్నారుల టీకా వేయడంలో మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది.

నిబంధనలను పాటించడం ఆధారంగా..

జులై 15 నుంచి అక్టోబర్​ 13 మధ్య కరోనా మూడో ఉద్ధృతి భారత్​లో వ్యాపించే అవకాశం ఉందని.. రాయిటర్స్ వార్తా​ సంస్థ అధ్యయనం కూడా తెలిపింది. సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. అయితే.. దేశంలో కరోనా మూడో దశ తప్పనిసరిగా వస్తుందనడానికి ఎలాంటి కచ్చితమైన సమాధానం లేదని ప్రముఖ వైరాలజిస్టు ప్రొఫెసర్ షాహిద్​ జమీల్​ చెబుతున్నారు. దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు ఎలా పాటిస్తున్నారన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో సింగిల్​ డోసు టీకా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పిల్లలతో ఆ ప్రమాదం..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పాఠాశాలలను పునఃప్రారంభించడం.. సురక్షితమైన వాతావరణం మధ్య జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అభిప్రాయపడింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనను పరిష్కరించే విధంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మరోవైపు.. పిల్లలకు కరోనా సోకితే స్వల్ప లక్షణాలు ఉంటాయని, మరికొందరిలో లక్షణాలు కూడా కనిపించవని డాక్టర్ రణదీప్​ గులేరియా చెప్పారు. కానీ, వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేశంలో అంతంతమాత్రంగా ఉన్న వైద్య వ్యవస్థకు ఇది అతిపెద్ద విఘాతంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో పిల్లలకు టీకాలు వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: Corona Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.