ETV Bharat / city

ఒకేచోట కొవిడ్ నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సినేషన్

సికింద్రాబాద్ సీతాఫల్​మండిలోని కుట్టివెల్లోడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు, కొవిడ్ టీకాలు అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్నారు. రెండు పక్కపక్కనే నిర్వహించడం వల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం నెలకొంది. భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదు.

corona rules violation, corona vaccine, covid tests, kutti vellodi phc
కరోనా నిబంధనల ఉల్లంఘన, కరోనా వ్యాక్సిన్, కొవిడ్ వార్తలు
author img

By

Published : Apr 17, 2021, 11:28 AM IST

సికింద్రాబాద్ సీతాఫల్​మండిలోని కుట్టివెల్లోడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆస్పత్రికి వెళ్లే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిర్ధరణ పరీక్ష, కరోనా టీకా ఒకే చోట నిర్వహిస్తుండటం వల్ల ఇతరులకూ వైరస్ సోకే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదని వాపోతున్నారు.

అక్కడి వైద్యాధికారిని వివరణ కోరదామన్నా.. ఎవరూ అందుబాటులో లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత పాజిటివ్ నిర్ధరణ అయిన వారికి.. టీకాలు వేసే గదిలోనే మందులు ఇస్తున్నారని, దీని వల్ల ఇతరులకు మహమ్మారి సోకే ప్రమాదముందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.