సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోసాని గురువారం వెల్లడించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స పొందుతున్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు కూడా కొవిడ్ సోకిందని పోసాని తెలిపారు.
నాకు కరోనా రావడం వల్ల 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. నా వల్ల అసౌకర్యం కలిగిన దర్శక, నిర్మాతలు, హీరోలు క్షమించాలి' అని పోసాని పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటాను అని అన్నారు పోసాని.
ఇదీ చదవండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' సంక్రాంతికి రిలీజ్