పర్యావరణాన్ని రక్షించినట్లైతే అది మనల్ని రక్షిస్తుందని... ప్రస్తుతం కరోనా వైరస్‌తో కలిసి ఉండాల్సిన పరిస్థితి తలెత్తేది కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పర్యావరణానికి దూరంగా బతుకుతూ, హాని కలిగించినట్లైతే... కరోనా మహామ్మారి లాంటివి భవిష్యత్తులోనూ వస్తాయని పేర్కొన్నారు. రాజ్‌భవన్ నుంచి కొండా లక్ష్మణ్ బాపు ఉద్యానవన విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఉద్యానవన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పామ్ సంబంధింత ఉత్పత్తులపై పరిశోధన చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఔషధ మొక్కలపై మరింత పరిశోధన చేయటానికి ప్రస్తుత సరైన సమయమని వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఇలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాల బలహీనతలు, బలాలను గుర్తించేందుకు సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!