రాష్ట్ర పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా సోకింది. ఇందులో ఐపీఎస్ అధికారితోపాటు ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు అదనపు ఎస్పీలు ఉన్నారు. 100 మంది శిక్షణ ఎస్సైలతోపాటు మరో 70 మందికి పైగా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో ఆకాడమీలో శిక్షణ పొందుతున్న ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు.
పాటిజివ్ వచ్చిన వారిలో 90 శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. 'కరోనా సోకిన వారికి పోలీస్ అకాడమీలోనే ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీళ్లందర్ని అందులోనే ఉండాలి' అని అధికారులు సూచించారు. లక్షణాలు కనిపించిన వాళ్లకే కరోనా పరీక్ష నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జులై 1వ తేదీ నుంచి శిక్షణ ఎస్సైలకు రెండో టర్మ్ పరీక్షలు జరగనున్నాయి. కరోనా కలకలంతో వారికి ప్రస్తుతం ఐదు రోజుల ప్రిపరేషన్ సెలవులు ఇచ్చారు.
అకాడమీలో 11 వందల మందికి పైగా ఎస్సైలు, 600 మంది కానిస్టేబుళ్లుతోపాటు శిక్షణ ఇచ్చే అధికారులు సిబ్బందితో కలుపుకొని మొత్తం 2300 మంది ఉంటారని సమాచారం.
ఇదీ చూడండి: భారత్లో మరో ఫ్లాయిడ్.. ఈసారి ఆటోడ్రైవర్