ETV Bharat / city

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ - telangana varthalu

Corona negative for CM KCR
సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌
author img

By

Published : Apr 28, 2021, 7:07 PM IST

Updated : Apr 28, 2021, 7:25 PM IST

19:05 April 28

సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎంకు కొవిడ్ నెగెటివ్ నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19న కేసీఆర్ కొవిడ్ పరీక్ష చేసుకోగా... పాజిటివ్ వచ్చింది. అప్పట్నుంచి వైద్యుల సూచన మేరకు సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్​లో ఉన్నారు. వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది. 

  మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేసుకున్నారు. ఛాతీలో ఎలాంటి ఇన్​ఫెక్షన్ లేదని సీటీ స్కాన్​లో తేలినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరోమారు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ యాంటీజెన్​తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్​లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు రేపు రానున్నాయి. 

ఇదీ చదవండి: ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

Last Updated : Apr 28, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.