హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరోసారి కరోనా కోరలు చాచింది. పలువురు పోలీసు సిబ్బందికి రెండోసారి మహమ్మారి సోకింది. ఠాణాలో పనిచేస్తున్న నలుగురు సెక్టార్ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కొవిడ్ నిర్ధరణ అయింది. ఆ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లూ గర్భిణులు కావడంతో మరింత అందోళన చెందుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు ముగిసిన అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించుకోగా.. పాజిటివ్ అని తేలింది. వీరు జూన్ నెలలో మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. మళ్లీ ఇప్పుడు కరోనా సోకడంతో ఒకింత భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: మహిళ దారుణహత్య.. అత్యాచారం చేసి చంపేశారా?