ETV Bharat / city

పనులు ఆగితే ఖరీఫ్‌లో విక్రయాలకు కొరత - తెలంగాణలో కరోనా ప్రభావం

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాల ఉత్పత్తిపై కరోనా ప్రభావం పడింది. ప్రస్తుతం వీటి శుద్ధి, ప్యాకింగ్‌ విత్తన కంపెనీల్లో ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పనులు జరగకపోతే వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా విత్తన విక్రయాలు చేయడం కష్టమని జాతీయ విత్తన కంపెనీల సంఘం (ఎన్‌ఎస్‌ఏ) తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చింది.

corona effect on seeds cleening
పనులు ఆగితే ఖరీఫ్‌లో విక్రయాలకు కొరత
author img

By

Published : Apr 5, 2020, 8:38 AM IST

ప్రస్తుత యాసంగి సీజన్‌లో గత అక్టోబరు నుంచి సాగుచేసిన విత్తన పంటలు ఇప్పుడు పూత, కోత దశలో ఉన్నాయి. ఈ పంటలను కోసిన తర్వాత రైతుల పొలాల నుంచి విత్తనాలను శుద్ధి కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అనంతరం వాటి నాణ్యతను పరీక్షించి శుద్ధిచేసి ప్యాకింగ్‌ చేస్తేనే ఖరీఫ్‌ అవసరాలకు అమ్మడం సాధ్యమవుతుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు నేరుగా 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేసింది.

నిత్యావసర చట్టం కిందకు..

ఇది అమలు కావాలంటే ఇప్పుడు రైతుల నుంచి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పంటలను కొని శుద్ధి ప్లాంట్లకు తరలించి ప్యాకింగ్‌ పనులు చేయాలి. విత్తనాలు నిత్యావసర చట్టం కిందకు వస్తాయి. లాక్‌డౌన్‌లో నిత్యావసరాలకు మినహాయింపు ఇచ్చినందున విత్తన శుద్ధి ప్లాంట్లు పనిచేయడానికి, వాటి రవాణా, అమ్మకాలకు అనుమతించాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి, రాష్ట్ర వ్యవసాయ మంత్రికి లేఖలు రాసినట్లు ఎన్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు ఎం.ప్రభాకరరావు ‘చెప్పారు. విత్తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను ఐడీ కార్డుల ఆధారంగా అనుమతించాలని, విత్తనాలు రవాణా చేసే వాహనాలను ఆపకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.

అంతర్రాష్ట్ర రవాణాకూ..

వచ్చే నెల నుంచి పంజాబ్‌లో పత్తి సాగు పనులు మొదలవుతాయి. మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పంటల విత్తన విక్రయాలను ఆరంభించాలి. ఇది జరగాలంటే ఇప్పుడు పనులు ఆగకుండా చూడాలని.. లాక్‌డౌన్‌ నుంచి మినహాయించాలని కోరినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తెప్పించాల్సి ఉన్నందున అంతర్రాష్ట్ర రవాణాకూ అనుమతించాలని సూచించారు.

కోటీ 10 లక్షల పత్తి విత్తనాలు..

విత్తనాల తయారీ, అమ్మకాలకు అనుమతించకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని ‘రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’ ఎండీ కేశవులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో కోటీ 10 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయానికి సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ తాజాగా విత్తన కంపెనీలకు సూచించింది. ఇవి రావాలంటే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయించాలనేది కంపెనీల విన్నపం.

ఇవీ చూడండి: ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.