ETV Bharat / city

కరోనాకాలం: వేర్వేరు ప్రాంతాల్లో వధూవరులు - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి న్యూస్

ఒకటో, రెండో కాదు.. వందలాది పెళ్లిళ్లకు కరోనా దెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. కరోనా భయం, లాక్‌డౌన్‌ ప్రభావమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

corona-effect-on-marriages
కరోనాకాలం: వేర్వేరు ప్రాంతాల్లో వధూవరులు
author img

By

Published : Apr 9, 2020, 7:54 AM IST

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముహూర్తాలు అధికంగా ఉండటంతో రెండు నెలల ముందే చాలా మంది పెళ్లి తేదీలు నిశ్చయించుకున్నారు. కరోనా దెబ్బతో ఊహించని పరిణామాలు తలెత్తాయి. ఏర్పాట్ల కోసం చెల్లించిన అడ్వాన్సులు, ఇప్పటికే చేసిన ఖర్చులు ఏమవుతాయో తెలియని పరిస్థితి. పెళ్లిళ్ల సీజన్‌పై ఆధారపడి జీవించే వేల మంది ఉపాధిపైనా తీవ్ర ప్రభావం పడింది.

ముందస్తు ఏర్పాట్లపై అనిశ్చితి

* మే 4న విజయవాడలోని వివాహం జరగాల్సిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ అమెరికాలోనే చిక్కుకుపోయారు. వారు ఇప్పట్లో భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేశారు.

* పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి విశాఖపట్నంలో, అమ్మాయి హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వివాహమూ వాయిదా పడింది.

* భూగర్భ జలశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కుమార్తెకు ఈ నెల 11న రాజమహేంద్రవరంలో వివాహం జరపాలని నిర్ణయించారు. కల్యాణ వేదిక సహా అన్నింటికీ అడ్వాన్సులు చెల్లించేశారు. శుభలేఖల పంపిణీ పూర్తయిపోయింది. లాక్‌డౌన్‌తో పెళ్లిని తాత్కాలికంగావాయిదా వేశారు.

* తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీకాకుళం జిల్లా యువకుడికి ఈ నెల 15న పెళ్లి జరగాల్సి ఉంది. నెల రోజుల కిందటే ఏర్పాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చేశారు. కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేశారు.

శుభలేఖలు పంచేసినా..

* కొందరు ముందుగానే శుభలేఖలు పంచేశారు. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు.

* కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. మళ్లీ తాము అనుకున్న తేదీలకు అవి కుదురుతాయో లేదోనన్న ఆందోళన ఉంది.

* ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? లేదా? అనేది స్పష్టత లేకపోవటంతో నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన​ తల్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.