ETV Bharat / city

పెరుగుతున్న కరోనా కేసులు.. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం

రాష్ట్రంపై మరో మారు కరోనా పంజా విసురుతోంది. గత నెల రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 313 మందికి వైరస్ సోకింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులల్లో కొవిడ్ కేసులు రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్నారులకు వైరస్ సోకటం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు పంపాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయినట్టు ప్రకటించింది.

telangana corona cases
పెరుగుతున్న కరోనా కేసులు.. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
author img

By

Published : Mar 19, 2021, 9:46 AM IST

Updated : Mar 19, 2021, 12:20 PM IST

ఏడాది కాలంగా తీసుకున్న జాగ్రత్తలు, లాక్​డౌన్​లు, కర్ఫ్యూలు కలిసి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని సంబరపడ్డాం. గత నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల నమోదు అవుతోంది.

తాజాగా 313 మంది కొవిడ్ బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి సోకిన వారు 3 లక్షల 2వేల 360కి చేరారు. తాజాగా 142 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,262కి చేరింది. మరో ఇద్దరు మృతి చెందగా మొత్తం 1,664 మంది కొవిడ్ కోరల్లో చిక్కి మరణించారు. ప్రస్తుతం 2,434 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అందులో 943 మంది ఐసోలేషన్​లో ఉన్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

జిల్లాల వారీగా కేసులు..

తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్​ఎంసీ 47, ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 3, జగిత్యాల 8, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 1, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 16, కరీంనగర్ 9, ఖమ్మం 8, కుమురం భీం ఆసిఫాబాద్ 5, మహబూబ్​నగర్ 9, మహబూబాబాద్​ 5, మంచిర్యాల 10, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 20, ములుగు 2, నాగర్​కర్నూల్ 1, నల్గొండ 8, నిర్మల్ 25, నిజామాబాద్ 15, పెద్దపల్లి 3, రాజన్న సిరిసిల్ల 12, రంగారెడ్డి 29, సంగారెడ్డి 13, సిద్దిపేట 7, వికారాబాద్ 8, సూర్యాపేట 7, వికారాబాద్ 8, వనపర్తి 3, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 8, యాదాద్రి భువనగిరి 8 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

నారాయణపేట జిల్లాలో మాత్రం..

నారాయణపేట జిల్లాలో మాత్రం ఒక్క కేసూ నమోదుకాలేదని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. గడచిన వారం రోజుల్లో మల్కాజిగిరి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్​లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.

పాఠశాల నిర్వహణపై..

గతంలో కొవిడ్​ కేసుల తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం.. బడులను ప్రారంభించింది. ముందుగా పదో తరగతి, ఆ తర్వాత క్రమంగా కింది తరగతుల వారికి తరగతులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా పాఠశాలల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్, జీహెచ్​ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గురుకుల వసతి గృహాల్లోని విద్యార్థులు మహమ్మారి బారిన పడుతున్నారు. తమ పిల్లలకు ఎక్కడ వైరస్ సోకుతుందో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టు సమాచారం.

సరిహద్దుల్లో..

ఇక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన సర్కారు.. సరిహద్దుల్లోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల డీఎంహెచ్​వోలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లోంచి వచ్చే వారిని గుర్తించి పరీక్షలు చేయాలని ఆదేశించింది. వారికి కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్​ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని చోట్ల బోర్డర్ చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్​ పరీక్షలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తోంది.

టీకా అందుబాటలోకి వచ్చినప్పటికీ ప్రజలు తప్పక కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులకు ప్రధాన కారణం గుంపులుగా అనేక కార్యక్రమాలకు హాజరుకావటమేనని.. భౌతిక దూరం పాటించడం సహా మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

ఇవీచూడండి: కరోనా వైరస్‌ మళ్లీ జూలు విదిలిస్తోందా..?

Last Updated : Mar 19, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.