ETV Bharat / city

కర్ఫ్యూతో ఏపీలో పాజిటివిటీ రేటు తగ్గిందా? - curfew in ap

ఏపీలో పగటి కర్ఫ్యూతో కరోనాకు కళ్లెం పడిందా..? ప్రభుత్వం ఆశించినట్లు కొవిడ్‌ కేసులు తగ్గాయా..? కనీసం ఆ ఛాయలైనా కనిపిస్తున్నాయా..? కర్ఫ్యూకు ముందు పాజిటివిటీ రేటెంత..? కర్ఫ్యూ తర్వాత వైరస్‌ వ్యాప్తి ఏ రీతిలో ఉంది..? గణాంకాలు ఏం చెప్తున్నాయ్‌...? ఓ సారి తెలుసుకుందాం.

ap curfew, curfew in ap, ap corona crisis
ఏపీ కర్ఫ్యూ, ఏపీలో కర్ఫ్యూ, ఏపీలో కరోనా వ్యాప్తి
author img

By

Published : May 18, 2021, 12:48 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల మొదలైనా.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే ఏపీలో మాత్రం పాజిటివిటీ రేటు పైపైకి వెళ్తోంది. ఏప్రిల్‌ నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల కట్టడికి.. పొరుగునున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా.. లాక్‌డౌన్‌ పెట్టేశాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం కర్ఫ్యూతోనే కొవిడ్‌కు కళ్లెం వేస్తామని ప్రకటించింది.

కర్ఫ్యూతో ఏపీలో పాజిటివిటీ రేటు తగ్గిందా?

కర్ఫ్యూ ఉన్నా.. తగ్గని కేసులు..

ఈనెల 5 నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చినా.. కేసులు తగ్గుతున్న దాఖలాలేవీ కనిపించడంలేదు. ఏప్రిల్‌ 1 - మే 16 వరకు చూస్తే.. వారవారానికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పల్లెలు, పట్టణాల్లో వైరస్‌.. మరింతగా విస్తరిస్తోంది ఏప్రిల్‌ 1 - 7 మధ్య 13 జిల్లాల్లో కలిపి.. 2,19,404 నమూనాలు పరీక్షించగా.. 5.14 శాతం పాజిటివిటీ నమోదైంది. మే 8 - 16 మధ్య 8,14,435 మంది కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 23.34 శాతం పాజిటివ్‌ కేసులొచ్చాయి.

పల్లెల్లో క్రమంగా పెరుగుతున్నకేసులు..

ఏప్రిల్‌ తొలి వారంలో.. పట్టణాలు, నగరాల్లో 60 శాతం, పల్లెల్లో 40 శాతం కరోనా కేసులొచ్చాయి. ఇప్పుడు 44 శాతం పట్టణాల్లో, 57 శాతం పల్లెల్లో కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో.. పల్లెల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. కేసులతోపాటు మరణాలూ.. ఏపీలో అధికంగానే నమోదు అవుతున్నాయి. ఏప్రిల్‌ మూడో వారం నుంచి.. మరణాలు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఒక్కో రకంగా.. కొనసాగుతోంది. ఏప్రిల్‌ మొదటి వారంలో.. అత్యధిక కేసులు గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదవగా.. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా తల్లడిల్లుతోంది.

కరోనాతో సతమతమవుతున్న తూర్పుగోదావరి..

మే 8 నుంచి 16 మధ్య తూర్పుగోదావరి జిల్లాలో.. 64,663 నమూనాలు పరీక్షించగా.. 25,083 పాజిటివ్‌ కేసులు తేలాయి. అనంతపురం జిల్లాలో 52,127 పరీక్షలకు 19,220 పాజిటివ్‌ కేసులు, కడప జిల్లాలో 47,719 పరీక్షలకుగాను.. 13,509 పాజిటివ్‌ కేసులు.. బయటపడ్డాయి. గడచిన వారంలో 38.79 శాతం పాజిటివ్‌ కేసులతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో, 10.98 శాతం కేసులతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.