ETV Bharat / city

ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లోనే 157 - గుంటూరు కరోనా కేసులు

ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి కొత్తగా 24 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 22 ఆ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 405కి చేరగా.. ఇప్పటివరకూ ఆరుగురు మరణించారు. 11 మంది వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 388 మంది చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో మరో 5 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తుండగా.. అధికారులు నిర్ధరించాల్సిఉంది.

corona-cases-in-ap
ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లోనే 157
author img

By

Published : Apr 12, 2020, 6:09 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 82కు పెరిగింది. నిన్న మరో 5 కేసులు నమోదు కాగా... ఆయా బాధితులు ఇప్పటికే కరోనా సోకిన వారి బంధువులేనని అధికారులు తెలిపారు. ఇంకా 280 కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. కర్నూలు జిల్లా నంద్యాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. తొలుత స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయగా... కేసులు 3 నుంచి 19కి పెరిగినందున పట్టణమంతా వర్తింపచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యవసర సరకులు, కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే, పురపాలక సంఘం రసాయనాల పిచికారీ కొనసాగించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 82 కేసులు రాగా, ఒక్క నంద్యాలలోనే 25 ఉన్నాయి.

కడప జిల్లాలో

కడప జిల్లాలో ఇప్పటివరకూ 30 కేసులు నమోదు కాగా... మరో 401 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వృద్ధులు, అత్యవసరమని వైద్యులు సిఫారసు చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ.. ఫలితాలను 24 గంటలలోపు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా పరీక్షల ఫలితాలు వేగంగా అందించేందుకు అవసరమైన సంఖ్యలో ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా, లేరా అనేది ఆరా తీశారు. సంబంధిత పరికరాల లభ్యత, పనితీరు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్​సైట్‌లో డేటా ఆపరేటర్లు వివరాలు నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లాలో వరుసగా నాలుగో రోజూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదైన తిరుపతి సహా 7 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి వైరస్‌ నివారణకు విస్తృత చర్యలు చేపట్టారు. 3 కిలోమీటర్ల కంటైన్‌మెంట్ క్లస్టర్లు, 5 కిలోమీటర్ల మేర బఫర్‌జోన్లు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉద్ధృతంగా నిర్వహించారు. జిల్లాలో నమోదైన 19 కేసుల్లో రుయా ఆస్పత్రిలో 9, పద్మావతి వైద్య కళాశాల ఆస్పత్రిలో 10 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కొవిడ్‌ జిల్లా ఆస్పత్రిగా ప్రకటించి తగిన వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో 277 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఇతర జిల్లాల్లో

పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు కేంద్రీకృతమయ్యాయి. కర్నూలు జిల్లాలోని 82 కేసుల్లో నగరంలోనే 18, నంద్యాలలో 24 కేసులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని ఇస్లాంపేటలో 19, కృష్ణా జిల్లాలో 35 కేసులకు విజయవాడలోనే 27, విశాఖ జిల్లాలో 20 కేసులకు గాను, నగర పరిధిలోనే 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ప్రాతిపదికన మొత్తం 142 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చదవండి : రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.