ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఏపీలో మొత్తం కోవిడ్ సోకిన వారి సంఖ్య 1,177కు చేరింది. గడచిన 24 గంటల్లో మరణాలు నమోదుకాలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది.