ETV Bharat / city

కరోనా దెబ్బతో వృత్తులు చిత్తు - lock down effect on labor in telangana

డొక్కాడాలంటే రెక్కాడాలి. రెక్కాడాలంటే పని దొరకాలి. కరోనా, లాక్‌డౌన్‌ల పుణ్యమాని రెండూ లేకపోవడం బడుగులు, చిరుద్యోగుల వెన్ను విరిచింది. జీవితాలను ఛిద్రం చేసింది. రేపు గడిచేదెలా? అనే ఆలోచించడం అటుంచి ఈ రోజు నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలా? అని దిగులుపడే స్థితికి సగటు మనిషిని దిగజార్చింది.

corona and lock down effect on labor in telangana state as they lost their work
కరోనా దెబ్బతో వృత్తులు చిత్తు
author img

By

Published : May 24, 2020, 5:52 AM IST

వందలాది మంది సినిమా కార్మికులు, హోటళ్లలో పనిచేసే సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఫంక్షన్‌ హాళ్ల ఉద్యోగులు కళ్లముందే ‘చితి’కిపోయిన ఆశలకు..భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి మధ్య నలిగిపోతూ రోజురోజుకూ కుంగిపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం లేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న వివిధ రంగాలవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్మికులకు ‘సినిమా’ కష్టాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు వెయ్యి థియేటర్లలో 25-30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 50 శాతం థియేటర్లు, మల్టీప్లెక్సులు ఉన్నాయి. వాటిలో పనిచేసే బుకింగ్‌ క్లర్క్‌లు, ప్రొజెక్టర్‌ ఆపరేటర్లు, టార్చ్‌బాయ్స్‌, గేట్‌ కీపర్లు, హౌస్‌ కీపింగ్‌, క్యాంటీన్‌ తదితర విభాగాల్లో పనిచేసే వీరందరి వేతనం రూ.5-12 వేల లోపే. జీతం అద్దెలు, పిల్లల చదువులకే సరిపోతుంది. బొమ్మ పడితేనే వారి చేతిలో చిల్లర ఆడేది. అదే రోజువారీ ఇంటి ఖర్చులకు ఆధారం. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో వీరందరికీ ‘సినిమా కష్టాలు’ మొదలయ్యాయి.

చాలామంది సినిమా హాళ్ల యజమానులు ఫిబ్రవరి జీతాలు కూడా చెల్లించలేదని సమాచారం. దీంతో మూణ్నెల్లుగా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో వారంతా అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పిల్లలకు బిస్కెట్లు కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు పలువురు ‘ఈనాడు’ ఎదుట వాపోయారు. అద్దెలు కూడా కట్టలేక యజమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నామని, ముఖం చాటేస్తూ కాలం గడుపుతున్నామని, ఇలా ఎంత కాలం గడపాలో పాలుపోవడం లేదని పలువురు వాపోయారు.

అడ‘కత్తెర’లో ఉపాధి

ఈ మహమ్మారి క్షురకుల ఉపాధిపై తీవ్ర ప్రభావమే చూపింది. రెండు నెలలపాటు మూతపడిన సెలూన్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా, కరోనా భయంతో జనం అంతగా రావడం లేదని వృత్తిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గతంతో పోలిస్తే సగానికిపైగా గిరాకీ తగ్గింది. పరిస్థితి ఇప్పుడప్పుడే గాడిన పడుతుందన్న నమ్మకం సన్నగిలింది. దుకాణాల అద్దెలు, వేతనాలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు’’ అని మియాపూర్‌ ‘న్యూట్రెండ్స్‌ సెలూన్‌’ నిర్వాహకుడు తుకారం ఆవేదనను వెలిబుచ్చారు. ‘నా సెలూన్‌లో నాతోపాటు రూ.15 వేల వేతనంలో ఇద్దరు కుర్రాళ్లు పనిచేస్తారు. అద్దె మరో రూ.15 వేలు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 30-40 మంది కస్టమర్లు వచ్చేవారు. వారం రోజులుగా దుకాణాలు తెరుస్తున్నా పది మందికి మించి రావడం లేదు. ఇలాగైతే అద్దె కూడా కట్టే పరిస్థితి ఉండదు’ అని ఆయన వాపోయారు.

హోటల్‌ రంగం కకావికలం

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో చాలా రంగాలు కోలుకుంటున్నా హోటల్‌ వ్యాపారం మాత్రం ఇంకా అయోమయంలోనే ఉంది. సిబ్బందికి వేతనాలు చెల్లించలేక..కిరాయిలు కట్టలేక పలువురు వ్యాపారులు కుంగిపోతున్నారు. ‘మా హోటల్‌లో 180 మంది వరకు సిబ్బంది పనిచేస్తారు. భవనం అద్దె రూ.6 లక్షలు. వేతనాలు రూ.18 లక్షల వరకు చెల్లించాలి. స్టోర్‌, వాహనాల పార్కింగ్‌, సిబ్బంది వసతుల కోసం మరో రూ.10 లక్షల వ్యయం అవుతుంది. రెండు నెలలుగా పైసా ఆదాయం లేదు. రెండు నెలలుగా హోటల్‌ నడవకపోవడంతో దాదాపు రూ.20 లక్షల విలువైన సరకులు పాడయ్యాయి. మమ్మల్నే నమ్ముకున్న పనివాళ్లను తీసేయలేక, ఉంచుకోలేక సతమతమవుతున్నాం’ అని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని ‘కాకినాడ సుబ్బయ్య గారి హోటల్‌’ నిర్వాహకుడు పూర్ణచందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బతుకు ‘బొమ్మ’ ఆడలే

థియేటర్‌లో బుకింగ్‌ క్లర్క్‌గా పనిచేస్తా. జీతం నెలకు రూ.6 వేలు. క్యాంటీన్‌లోనూ పనిచేస్తూ రోజుకు మరో రూ.200 సంపాదిస్తా. ఈ డబ్బే మా కుటుంబంలో నలుగురికి ఆధారం. ఫిబ్రవరి వేతనమే ఇంకా ఇవ్వలేదు. అడిగితే యజమాని పట్టించుకోవడం లేదు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇలా ఎన్నాళ్లు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే బతుకు బండిని నెట్టుకురావడం కష్టమే.

ఇది కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి కన్నీటి కథ

క్యాటరింగ్‌ వ్యాపారం కరోనా పాలు

కరోనా క్యాటరింగ్‌ వ్యాపారాన్ని పిడుగుపాటులా తాకిందనే చెప్పాలి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వ్రతాలు తదితర 70 శాతం వరకు శుభకార్యాలు మార్చి-జూన్‌ మధ్య కాలంలోనే జరుగుతాయి. ఈ సమయంలోనే లాక్‌డౌన్‌ అమలవడంతో ఆ వ్యాపారం అంతా ఆవిరైంది. ఆ ప్రభావం దీనికి అనుబంధంగా ఉన్న చాట్‌, స్వీట్‌, ఐస్‌క్రీమ్‌, క్లీనింగ్‌, సర్వింగ్‌ తదితరాలపైనా పడింది. వివాహాలకు అనుమతి ఇవ్వకపోవడం, ఇచ్చినా 50 మందికే పరిమితం చేయడంతో చాలా మందికి క్యాటరింగ్‌ కోసం సంప్రదించడమే మానేశారని’’ వాటిని నడుపుతున్న వారు చెబుతున్నారు. ‘‘క్యాటరింగ్‌ రంగంలో మిఠాయి వంటకాలకు రాజస్థాన్‌, ఒడిశాలకు చెందిన వంట మనుషులు ప్రసిద్ధి. సర్వింగ్‌ విభాగంలో ఎక్కువగా పనిచేసేది విద్యార్థులే. వీరంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయారు. మిగిలిన సిబ్బంది కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతున్నారు’’ అని నాగోల్‌ జైపురి కాలనీకి చెందిన లక్ష్మీనర్సింహ క్యాటరర్స్‌ నిర్వాహకుడు మధు తెలిపారు. తన దగ్గర 50-60 మంది పని చేస్తారని, ఎప్పట్నుంచో ఈ పనికి అలవాటైన వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారని ఆయన వాపోయారు.

‘రామూ’లా ఇంకెందరో

మూసాపేట జనతానగర్‌లో ఉండే రాము ఆటో నడిపితే వచ్చే సొమ్మే కుటుంబానికి ఆధారం. లాక్‌డౌన్‌ అతడి కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. రెండు నెలలుగా ఆటో నడవకపోవడంతో పూట గడవటమే కష్టమైంది. లాక్‌డౌన్‌ సడలింపులతో నాలుగు రోజులుగా ఆటో నడుపుతున్నా..ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం లేకపోవడం, రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలవుతుండటంతో ఖర్చులకుకూడా రావడం లేదనేది అతని ఆవేదన. ‘కిస్తీ కట్టకుంటే ఫైనాన్షియర్లు ఆటో లాక్కుపోతారు. అంతకంటే ముందే ఆటోను అమ్మి కూలి పనులు చేసుకుందామని అనుకుంటున్నా’నని రాము ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తన ఒక్కడి దుస్థితే కాదని, తనలాంటి వేలాది మంది పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదని ఆయన చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.