గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్.. ఏటీ అగ్రహారంలో పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు దిశా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఓ కానిస్టేబుల్‌పై అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దారుణ ఘటనపై స్పందించిన అర్బన్ ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసుశాఖకు తలవంపులు తీసుకొచ్చే విధంగా వ్యవహరించిన సదరు కానిస్టేబుల్‌పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పాటు కానిస్టేబుల్ పనిచేస్తున్న సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తూ అర్బన్ ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం