వనపర్తిలో మైనర్ కుమారుడితో కలిసి ఉన్న తండ్రిపై వీరంగం వేసి.. అమానుషంగా దాడిచేసిన ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. కానిస్టేబుల్ అశోక్‌కుమార్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ అపూర్వారావు ఉత్తర్వులు జారీ చేశారు.
వనపర్తిలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి.. హోంమంత్రి, డీజీపీ.. తగు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. చర్యలు తీసుకుంటామంటూ వనపర్తి ఎస్పీ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఘటన జరిగిన గంటల్లోనే సదరు పోలీసు కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇవీచూడండి: కుమారుడు ఎదుటే తండ్రిని కొట్టిన కానిస్టేబుల్.. కేటీఆర్ ట్వీట్