గత నెల 24వ తేదీన టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాలలో జరిగిన అవకతవకలను వెంటనే సవరించాలని ఆర్.కృష్ణయ్య, కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత సాధించిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఐదుగురు నిరుద్యోగులు మృతి చెందారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ ఐకాస సమావేశం ఏర్పాటు చేసింది. కొంతమందికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బోర్డు పెట్టిన కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు. అవకతవకలను వెంటనే సరిచేసి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'ఎక్కువ మార్కులొచ్చినా.... ఉద్యోగం రాలేదు'