రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు వైస్రాయ్ గార్డెన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సేవాదళ్ ప్రతినిధులు హాజరైనట్లు అఖిల భారత సేవాదళ్ కోశాధికారి కనుకుల జనార్దన్ రెడ్డి తెలిపారు. సేవాదళ్ ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో వంద సంవత్సరాలు పూర్తవుతుండటంతో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు.
గత అరవై ఏళ్లుగా దేశాన్ని కాపాడుతూ రక్షణగా ఉన్న కాంగ్రెస్.. రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కించుకుంటుందని కోశాధికారి ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏడు లక్షల గ్రామాల్లో సేవాదళ్ వాలంటీర్లను నియమించి సేవాదళాన్ని మరింత పటిష్ఠం చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో తీర్మానం రాజ్యాంగ విరుద్ధం'