రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను.. ఎల్ఆర్ఎస్, ధరణి పేరుతో దోచుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఒకవైపు కరోనా పేరుతో ప్రైవేట్, కార్పోరేట్ ఆస్పత్రులు దోచుకుంటుంటే.. ఎల్ఆర్ఎస్, ధరణి పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని వీహెచ్ ఆరోపించారు.
రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం దోచుకుంటున్న తీరును.. ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం పేరుతో.. కేసీఆర్ ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు.. ప్రజల నుంచి రాబట్టడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడి చేస్తుందని.. దోపిడీ విధానాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: దుబ్బాక గెలుపే లక్ష్యంగా మండల ఇంఛార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్