ETV Bharat / city

అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఆరు బిల్లులకు ఆమోదం.. - budget session 2020

2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కరోనా ప్రభావం కారణంగా నిర్ణీత షెడ్యూలు కంటే ముందే సమావేశాలను ముగించారు. ఈ నెల 6న ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్​పై సాధారణ చర్చతో పాటు అన్ని పద్దులపైనా చర్చ జరిగింది.

budget session 2020
ఆరు బిల్లులకు ఆమోదం
author img

By

Published : Mar 17, 2020, 7:36 AM IST

అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ద్రవ్యవినిమయ బిల్లు సహా ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది. పట్టణప్రగతి, కరోనా అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 48 గంటల 41 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.

ఒక్క పథకం ఆపలేదు..

ద్ర‌వ్య‌వినిమ‌య బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వ ఉద్యోగులకు కేరళలో ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోతున్నార‌ని.. కానీ తెలంగాణలో ఒక్క పథకం ఆపలేదని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. రెవెన్యూ వృద్ధి రేటులో 21.5 శాతంతో దేశంలోనే మొదటి స్థానం సాధించామ‌ని వెల్ల‌డించారు.

ఐదేళ్లలో వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం రూ.2,72,926 కోట్లు ఇచ్చామ‌ని వివరించారు. కేంద్రం మాత్రం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1,12,854 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను పెంచుతున్నామ‌ని... ఎంఎంటీఎస్ నిధులు కేటాయించి పనులు వేగవంతానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

పౌరసత్వాన్ని నిరూపించాకోవాల్సిన దుస్థితి..

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లపై మేధావులు అభ్యంతరాలు చెప్పారని, మరి కొంత మంది నిరసన ప్రదర్శనలు చేశారని శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో సీఏఏను తెరాస ఎంపీలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 73 ఏళ్ల తరువాత పౌరసత్వం నిరూపించాకోవాల్సిన దుస్థితి రావడం దారుణమ‌న్నారు. తెరాస, ఎంఐఎం మిత్రపక్షమైనా అన్ని విషయాలు వారితో ఏకీభవించడం లేదని తెలిపారు.

కాంగ్రెస్ అసంతృప్తి..

బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేదని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న రాబడులకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ అడిగిన ప్రతిసారి ఇస్తామంటున్న కేసీఆర్‌... ఈసారి అడిగితే డీపీఆర్‌ లారీ అంత ఉందని చెబుతున్నారని దుయ్యబట్టారు. డీపీఆర్‌ పంపిస్తామంటే ఆ లారీల ఖర్చు సీఎల్పీ నుంచి తానే భరిస్తానని భట్టి తెలిపారు.

సమావేశాలను ఎందుకు కుదించారు..

కరోనా పేరుతో బడ్జెట్‌ సమావేశాలను ఎందుకు కుదించారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని... సమావేశాల్లో పలువురి సూచనలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.

ఇవీ చూడండి: చైనా వెలుపలే కరోనా మరణాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.