కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది. కరోనా, బ్లాక్ ఫంగస్‌కు ఉచితంగా చికిత్స చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ముఖ్యనేతలంతా సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.
దేశంలో భయంకర పరిస్థితి నెలకొన్నా.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తక్షణమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం సహా.. ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి బాధితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. మొదటి వేవ్‌లో కరోనా ఉద్ధృతిని చూసినా...మౌలికవసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాలలో నిరసనలు చేపట్టారు. సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ దీక్షలో పాల్గొన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్