ETV Bharat / city

Congress Dharna in Hyderabad : 'విచారణ పేరిట సోనియాను వేధిస్తున్నారు'

Congress Dharna in Hyderabad : సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో... హైదరాబాద్‌లోనూ హస్తం నేతలు ధర్నాకు దిగారు. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయల్దేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.

Congress Dharna in Hyderabad
Congress Dharna in Hyderabad
author img

By

Published : Jul 21, 2022, 12:55 PM IST

Updated : Jul 21, 2022, 2:39 PM IST

Congress Dharna in Hyderabad : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర సర్కార్‌ హస్తం పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఈడీ.. సోనియా గాంధీని విచారిస్తోందని విమర్శించారు. ఈ విషయమంతా ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు.

సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ నేతలు ధర్నాకు దిగారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నేతలు కార్యకర్తలు నల్ల రంగు బెలూన్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు.. నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు.

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అంజన్‌ కుమార్ నల్ల దుస్తులు, బెలూన్స్‌ ప్రదర్శిస్తూ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలివెళ్లారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సోనియా గాంధీని ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలతో కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి : ఈడీ విచారణకు సోనియా.. తోడుగా ప్రియాంక.. దేశవ్యాప్తంగా నిరసనలు

Last Updated : Jul 21, 2022, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.