వంటగ్యాస్ సిలిండర్ ధరను నెలలో మూడు సార్లు పెంచిన ప్రధాని మోదీ సామాన్యుల నడ్డివిరుస్తున్నారని టీపీసీసీ నాయకులు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గాంధీభవన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఉజ్మ షకీర్, బక్క జడ్సన్ ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుళజాతి కంపెనీలకు మేలు చేసే విధంగా ప్రధాని నిర్ణయాలు తీసుకుంటూ... సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో భాజపా హయాంలోని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
- ఇదీ చూడండి : 'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'