ETV Bharat / city

మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. కాంగ్రెస్​ ధర్నా! - కాంగ్రెస్​ మైనార్టీ సెల్

సచివాలయంలోని మసీదును కూల్చివేయడాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్​ పార్టీ మైనార్టీ సెల్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్​ నాంపల్లిలోని వక్ఫ్​బోర్డు కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో అంజని కుమార్​ యాదవ్​, ఫిరోజ్​ ఖాన్​ తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో మసీదు కూల్చివేసినా.. వక్ఫ్​బోర్డు ఛైర్మన్​ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

congress party protest against dismental masque in telangana secretariat
మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. కాంగ్రెస్​ ధర్నా!
author img

By

Published : Sep 3, 2020, 5:24 PM IST

మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. కాంగ్రెస్​ ధర్నా!

సచివాలయంలోని మసీదు కూల్చివేయడం పట్ల కాంగ్రెస్​ పార్టీ మైనార్టీ సెల్​ ఆధ్వర్యంలో నాంపల్లి వక్ఫ్​బోర్డు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ గ్రేటర్​ హైదరాబాద్​ అధ్యక్షులు అంజని కుమార్​ యాదవ్​, ఫిరోజ్​ ఖాన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సచివాలయంలోని మసీదును కూల్చినా.. వక్ఫ్​బోర్డు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సచివాలయం చుట్టూ రోడ్లు మూసివేసి మసీదును కూల్చేసి మైనార్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే.. అదే చోట కొత్త మసీదు నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్​ పార్టీ మైనార్టీ సెల్​ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అంజని కుమార్​ యాదవ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.