సీబీఐ, ఈడీ కేసులకు భయపడే ఏపీ సీఎం జగన్... ప్రధాని మోదీ భజన చేస్తున్నారని ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి గొప్ప నాయకుడి కడుపున పుట్టి ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. ప్రధాని మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌కు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బదులిచ్చారు. ప్రధాని మోదీకి అందరూ సహకరించాలంటూ ట్వీట్‌తో రిప్లై ఇచ్చారు. జగన్ ట్వీట్ పైనే... సప్తగిరి ఉలాకా తీవ్రంగా స్పందించారు.
ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎం ట్వీట్.. మోదీకి మద్దతుగా జగన్ రిప్లై!