ETV Bharat / city

ఈ పీఆర్సీ.. ఉద్యోగులను అవమానించడమే: రేవంత్‌రెడ్డి - పీఆర్సీపై రేవంత్ వ్యాఖ్యలు

ఉద్యోగులను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇది ఉద్యోగులను అవమానించడమేనని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక రూపకల్పనపై అనుమానం కలుగుతోందన్నారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Jan 27, 2021, 10:10 PM IST

కొత్త పీఆర్సీ ప్రతిపాదనలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ పీఆర్పీ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు పీఆర్పీ ఇవ్వాలన్నారు. కనీసం 43 శాతానికి తగ్గకుండా పీఆర్పీ ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కొత్త పీఆర్పీపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆరోపించారు. కేవలం 7.5 శాతం ఫిట్​మెంట్ ప్రతిపాదించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి పీఆర్సీ ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు. నివేదిక రూపకల్పనపైనే అనుమానం కలుగుతోంది. శాస్త్రీయ అధ్యయనం జరిగిన దాఖలాలు లేవు. పీఆర్పీని మూడేళ్లు పెండింగ్​లో పెట్టి, నివేదిక వచ్చిన తరువాత త్రిసభ్య కమిటీ పేరుతో ప్రభుత్వం నెల రోజులుగా కాలయాపన చేసింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు.. 7.5 శాతం ప్రతిపాదించడం ఘోరంగా ఉంది. ఇది ఉద్యోగులను అవమానించడమే.

- రేవంత్ రెడ్డి

ఇదీ చదవండి : 43 శాతం ఫిట్‌మెంట్‌ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.