ETV Bharat / city

రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. రేవంత్​పై పరోక్ష విమర్శలు..! - భాజపాలో చేరికపై స్పందించిన రాజగోపాల్​రెడ్డి

Rajagopal Reddy: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు.. రాజకీయ, రాజీనామా అంశాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. పార్టీ మారాల్సి వస్తే.. స్థానిక ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తెరాసను ఓడించే శక్తి భాజపాకే ఉందని గతంలోనే చెప్పానని.. ఇప్పటికి అదే మాటకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

Rajagopal Reddy
Rajagopal Reddy
author img

By

Published : Jul 24, 2022, 3:07 PM IST

సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరం: రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy: సమయం వచ్చినపుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్​రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ వ్యూహంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయన్న రాజగోపాల్​.. ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి భాజపాకే ఉందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో తాను నీతులు చెప్పించుకోలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం.. కానీ..

"పార్టీ మారుతున్నానంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందరి సమక్షంలోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిశాను. రాజకీయ, రాజీనామా అంశాలు మా మధ్య చర్చకు రాలేదు. రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం అప్పుల పాల్జేసిందని వివరించా. ఉప ఎన్నిక వస్తుందని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. గట్టుప్పల్‌ను మండలం చేసి నేతలను తెరాసలో చేర్చుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత తెరాస గ్రాఫ్‌ పడిపోయింది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలవాలని సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదు. కాంగ్రెస్‌ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం. కాంగ్రెస్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నేను ఏమీ అనలేదు. ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్‌ బాధ్యతలు ఇచ్చారు." - రాజగోపాల్​ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

కేసీఆర్‌ను ఓడించే శక్తి భాజపాకే..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.