రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త సారథి ఎంపిక కోసం కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి మాణికం ఠాగూర్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికే ప్రధానాశంగా... కాంగ్రెస్ సీనియర్లతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ నేతల నుంచి మాణికం ఠాగూర్ అభిప్రాయాలు సేకరిస్తారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పీసీసీ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో... రేపు సీనియర్‌లతో జరగనున్న కోర్ కమిటీ సమావేశం కీలకంగా మారింది. రేపటి సమావేశంలో... నూతన సారధి ఎంపికపై సీనియర్ నేతలు కోర్‌కమిటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు.