Congress leaders protest at Gandhi Bhavan: ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం గాంధీభవన్‌లో జరిగిన పోలింగ్ సందర్భంగా అగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఓటర్ల జాబితాలో రాత్రికి రాత్రే పేర్లు మార్పు చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తదితర నేతలు గాంధీభవన్ మెట్లపై బైఠాయించారు. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జిల్లాలో 32 ఓట్లు కొత్త వారికి ఇచ్చారని.. దీనిపై ఏఐసీసీ ఎన్నికల అథారిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు రేణుకా చౌదరి తెలిపారు.
ఓటు కార్డులు ఇచ్చి ఎందుకు అవమానించారు.. ఓటరు కార్డులు ఇచ్చి ఎందుకు అవమానించారని దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. ఇది పూర్తిగా అవమానించడమేనని.. ఇలాంటి వ్యవస్థ ఉండకూడదని మండిపడ్డారు. ఏ కారణంతో పేరు తొలగించారో కాంగ్రెస్ కార్యకర్తలకు వివరణ ఇవ్వాలన్నారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
24 గంటలు గడవకముందే వాటిని మార్చేశారు.. గాంధీభవన్ మెట్లపై నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి రావడం అవమానకరమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 55 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉంటున్న తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు తనతో పాటు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డికి కార్డులు ఇచ్చారని.. 24 గంటలు గడవక ముందే మార్చేశారని మండిప్డడారు.
ఇవీ చదవండి: