సీఎం కేసీఆర్ సైనిక పాలనను గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి... సీఎం కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లో జంగ్ సైరన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పేదలకు విద్యను దూరం చేస్తూ... విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను నిలదీస్తూ జంగ్ సైరన్ మోగించామని ప్రకటించారు. అత్యంత సున్నితమైన చార్మినార్ వద్ద భాజపా సభకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్... కాంగ్రెస్ శాంతియుతంగా చేసే జంగ్ సైరన్ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. అమరులకు నివాళి అర్పిస్తామంటే కేసీఆర్‌కు వెన్నులో ఎందుకు వణుకు పుడుతోందని నిలదీశారు.
కోలుకున్నాకే ప్రచారం..
"శ్రీకాంతాచారి విగ్రహానికి దండ వేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడం ఏమిటి. విద్యార్థులపై పోలీసులు అమానుషంగా దాడిచేసి కొట్టారు. నిన్నటి దినం సిగ్గుపడాల్సిన రోజు. తెగింపుతో పోరాటం చేస్తున్న బల్మూరు వెంకట్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్‌లో యువతకు ప్రాధాన్యత ఉంటుంది. వెంకట్ పక్కటెముకలు విరిగినందున.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకట్ కోలుకోగానే హుజూరాబాద్‌లో రాష్ట్ర నాయకత్వం అంతా ఏకమై ప్రచారాన్ని మొదలు పెడుతాం. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాంగ్రెస్‌తో కలిసి రండి." - మధుయాష్కీగౌడ్, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్
ఇదీ చూడండి: