గోషామహల్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ను పరామర్శించేందుకు వెళ్లిన నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఉదయం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన బలగాలు వారి అడ్డుకుని, అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు విక్రమ్‌గౌడ్, అనిల్ కుమార్ యాదవ్‌లు గోషామహల్ స్టేషన్‌కు వెళ్లారు. ఠాణాలోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో.. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి... పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇవీచూడండి: ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ ప్రగతిభవన్ ముట్టడి