యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించడంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత తొలగింపుపై పునరాలోచించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కోరారు. దేశంలో మిగతా పార్టీలు ఉండొద్దని భాజపా నేతలు కోరుకుంటున్నారని.. మహారాష్ట్రలో గవర్నర్ ఆహ్వానించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారని వీహెచ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో జై జవాన్, జై కిసాన్ నినాదం అమలుకావడం లేదని వీహెచ్ అన్నారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ తీసుకొస్తామని కేసీఆర్ చెప్పినా.. పరిస్థితిలో మార్పురాలేదని ఆరోపించారు. రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు జఠిలం అవుతున్నయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ పోరాటం చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా తన నంబర్ 9704937780 కు ఫోన్ చేయాలని సూచించారు. గోల్నాక ఘటనపై అధికార యంత్రాంగం సరిగా వ్యవహరించలేదని వీహెచ్ మండిపడ్డారు. కనీసం ఘటనా స్థలాన్ని ఆర్టీవో, తహసీల్దార్లు పరిశీలించలేదని ఆరోపించారు.
ఇవీచూడండి: 'కార్మికులను పిలవకపోతే మమ్మల్ని పిలవండి'