ETV Bharat / city

ఖర్గే విజన్ ఖర్గేకు ఉంది.. నా విజన్​​​ నాకు ఉంది: శశిథరూర్​ - ఖర్గే పై శశి థరూర్​ అభిప్రాయం

Shashi Tharoor press meet in Hyderabad: స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిపించేందుకు గాంధీ కుటుంబం కట్టుబడి ఉందని కాంగ్రెస్​ పార్టీ నాయకుడు శశిథరూర్​ అన్నారు. హైదరాబాద్​లోని తాజ్​ కృష్ట హోటల్​లో సమావేశం నిర్వహించిన ఆయన.. భాజపాను ఎలా ఎదుర్కోవాలని అనేదే మా కాంగ్రెస్​ ఫ్యామిలీ అంతర్గత చర్చ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఖర్గేపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీభవన్ వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్​ పేర్కొన్నారు.

Shashi Tharoor
Shashi Tharoor
author img

By

Published : Oct 3, 2022, 2:18 PM IST

Updated : Oct 3, 2022, 2:25 PM IST

Shashi Tharoor press meet in Hyderabad: స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిపించేందుకు గాంధీ కుటుంబం కట్టుబడి ఉందని కాంగ్రెస్​ పార్టీ నాయకుడు, అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్​ అన్నారు. హైదరాబాద్​లోని తాజ్​కృష్ట హోటల్​లో సమావేశం నిర్వహించిన ఆయన.. భాజపాను ఎలా ఎదుర్కోవాలనేదే కాంగ్రెస్​ ఫ్యామిలీ అంతర్గత చర్చ అని అన్నారు. కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తివంతులు అనేదే మా ప్రధాన ప్రశ్న అని చెప్పారు. సమావేశంలో ఆయనకు ఖర్గేపై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

పార్టీ ఫండమెంటల్​ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే విధానమని శశిథరూర్​ చెప్పుకొచ్చారు. ఇటీవలే తాను ఖర్గేతో మాట్లాడానని.. ఆయన ఒక గొప్ప నేత అని కొనియాడారు. ఖర్గేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఖర్గే కేవలం దళిత నాయకుడుగా పరిమితం కాలేదన్నారు. ఈ క్రమంలోనే ఖర్గే విజన్ ఖర్గేకు ఉంది.. తన విజన్​ తనకు ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో జీ23 అనేదే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన శశిథరూర్​.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని.. తానే వెళ్లలేకపోయానని వివరించారు. రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్ వచ్చి ప్రచారం చేసుకుంటానని తెలిపారు. తాను హైదరాబాద్​లో కొందరిని వేరువేరుగా కలవబోతున్నాని ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.