ETV Bharat / city

'తెరాస పెట్టిన ఖర్చుపై కాంగ్రెస్ చర్చకు సిద్ధం' - గాంధీభవన్​లో పొన్నాల సమావేశం తాజా వార్తలు

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని కాంగ్రెస్​ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆ జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస పార్టీ మేనిఫెస్టోను వాళ్ల వెబ్​సైట్​ నుంచి తొలగించారని పేర్కొన్నారు. కేటీఆర్​ రిలీజ్ చేసిన ప్రగతి నివేదికలో ఏమి లేదని విమర్శించారు.

congress leader ponnala said Congress ready for debate on trs spending 67 thousand crores
'తెరాస పెట్టిన ఖర్చుపై కాంగ్రెస్ చర్చకు సిద్ధం'
author img

By

Published : Nov 27, 2020, 2:22 PM IST

తెరాస పెట్టిన ఖర్చుపై కాంగ్రెస్ చర్చకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్​ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. జీహెచ్​ఎంసీపై రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెరాస చెబుతోందన్నారు. మెట్రోకు తెరాస పెట్టిన ఖర్చు ఏమి లేదని... పాత బస్తీకి మెట్రో లైన్ ఆగిపోయిందని అన్నారు. అభివృద్ధి ప్రణాళిక కాదది.. అది అవినీతి నివేదిక అని దానిపై విచారణ చేపట్టాలని పొన్నాల వెెల్లడించారు.

"కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గోదావరి నది జలాలను హైదరాబాద్​కు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఒక్క మెగా వాట్ కరెంట్ ఉత్పత్తి చేయకుండా వేల కోట్ల రూపాయల ఖర్చు ఎలా అయ్యింది. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. జాతర్లల్లో అమ్ముకునే వాళ్లు వచ్చినట్టు భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. భాజపా రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. మనకు నీళ్లు రాకుండా అడ్డుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఏ ముఖం పెట్టుకుని మన రాష్ట్రానికి వచ్చాడు.

ఉత్తరప్రదేశ్​లో ఒక దళిత మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే కనీసం ఆ శవాన్ని తల్లి తండ్రులకు కూడా ఇవ్వలేదు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్​లను తొలగించాలని ఎంఐఎం నాయకులు ఏలా అంటారు. ఎంఐఎం, భాజపా మత విద్వేషాలను రెచ్చకొడుతున్నాయి. రైతులు డబ్బులు కట్టలేదని జనగామలో విద్యుత్ అధికారులు ఒక కరెంట్ పోల్​ ట్రాన్స్ ఫార్మర్​కు తాళం వేశారని చెప్పారు."

- కాంగ్రెస్​ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

ఇదీ చూడండి : అప్పుడు అప్పు తీర్చింది.. ఇప్పుడు ప్రాణం తీసింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.