సహకార ఎన్నికలతో సీఎం కేసీఆర్ మరోసారి రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేసీఆర్ తన నిరంకుశ పాలనను మరోసారి నిరూపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార ఎన్నికల్లో రైతుల ఓటు తీసేయడం అంటే వారి హక్కులను హరించడమేనని ఆక్షేపించారు.
14 లక్షల మంది ఓట్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు రైతుబంధు గుర్తుకొస్తుందని విమర్శించారు. పంటల బీమా అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోయారని తెలిపారు.
ఇదీ చూడండి: మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!